- Telugu News Photo Gallery Cinema photos Heroine Raashii Khanna gets huge offers in digital platforms with movies and web series on November 2024, Details here
Raashii Khanna: డిజిటల్ లో దూసుకుపోతున్న రాశీ ఖన్నా.! సౌత్ ను వదిలి ఇతర ఇండస్ట్రీల వైపు.?
కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో కనిపించిన రాశీఖన్నా.. ఆ తరువాత తడబడ్డారు. అవకాశాలు తగ్గిపోవటంతో టాలీవుడ్‌ను వదిలి ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు. అయితే తన కెరీర్ గాడి తప్పడానికి రీజన్ ఏంటన్నది చాలా రోజులు తరువాత రివీల్ చేవారు రాశీ. ఊహలు గుసగుసలాడే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాశీఖన్నా ఆ తరువాత యంగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ సినిమాలు చేశారు. బొద్దుగుమ్మ ఇమేజ్ నుంచి బయటపడి గ్లామర్ క్వీన్‌గానూ ఆకట్టుకున్నారు.
Updated on: Nov 15, 2024 | 1:44 PM

కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫామ్‌లో కనిపించిన రాశీఖన్నా... ఆ తరువాత తడబడ్డారు. అవకాశాలు తగ్గిపోవటంతో టాలీవుడ్‌ను వదిలి ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు.

అయితే తన కెరీర్ గాడి తప్పడానికి రీజన్ ఏంటన్నది చాలా రోజులు తరువాత రివీల్ చేవారు రాశీ. ఊహలు గుసగుసలాడే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాశీఖన్నా ఆ తరువాత యంగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ సినిమాలు చేశారు.

బొద్దుగుమ్మ ఇమేజ్ నుంచి బయటపడి గ్లామర్ క్వీన్‌గానూ ఆకట్టుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న టైమ్‌లో సడన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్‌కు కారణమేంటో రివీల్ చేశారు రాశీ. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని, అతనితో బ్రేక్ అవ్వటం వల్లే కెరీర్ కష్టాల్లో పడిందన్నారు.

డిప్రెషన్‌తో బరువు పెరగటం వల్ల అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ప్రజెంట్ అన్నింటి నుంచి కోలుకొని మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నా అన్నారు.

ఇప్పుడు ఆశలన్నీ ది సబర్మతి రిపోర్ట్ మీదే పెట్టుకున్నారు రాశీ ఖన్నా. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో వస్తానని ఆశపడుతున్నారు.

అందుకే ప్రమోషన్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేచర్ రెయిజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

వరుస ఫొటోషూట్స్‌తో హల్ చేస్తున్న రాశీ, ఇప్పుడు హాట్‌నెస్ ఓవర్ లోడెడ్ అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్‌డేట్స్‌తో న్యూస్‌లో కనిపించకపోయినా.. గ్లామర్ అప్‌డేట్స్‌తో మాత్రం గట్టిగానే సందడి చేస్తున్నారు.




