- Telugu News Photo Gallery Cinema photos Heroine Keerthi Suresh interesting Comments on Hero Nani on his movies style Telugu Heroes Photos
Nani: ఈ ఏడాది సరిపోదా శనివారంతో లాక్ చేస్తానంటున్న నేచురల్ స్టార్ నాని.
సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించిన సినిమాలే కాదు, అందులో నటించిన జంటలు కూడా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతాయి. అలా, ఆడియన్స్ ని టచ్ చేసిన పెయిర్ నాని అండ్ కీర్తి. ఏడేళ్లల్లో వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు చేసేశారు. అయినా, నిన్ను వదలా బొమ్మాళీ అంటున్నారు నాని. ఇంతకీ, ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది.? నాని అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? రొమాంటిక్ కామెడీ సినిమాగా మెప్పించిన నేను లోకల్ విడుదలై ఏడేళ్లయింది.
Updated on: Feb 06, 2024 | 9:10 PM

సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించిన సినిమాలే కాదు, అందులో నటించిన జంటలు కూడా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతాయి. అలా, ఆడియన్స్ ని టచ్ చేసిన పెయిర్ నాని అండ్ కీర్తి.

ఏడేళ్లల్లో వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు చేసేశారు. అయినా, నిన్ను వదలా బొమ్మాళీ అంటున్నారు నాని. ఇంతకీ, ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది?

నాని అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? రొమాంటిక్ కామెడీ సినిమాగా మెప్పించిన నేను లోకల్ విడుదలై ఏడేళ్లయింది. దాన్నే గుర్తుచేసుకున్నారు కీర్తి. నానితో కలిసి చాలా సినిమాల్లో నటించాలని ఉందన్నది ఆమె కోరిక.

అది విన్న నాని.. 'కీర్తి.. నువ్వు తప్పించుకోలేవ్, నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటా' అంటూ సరదాగా స్పందించారు. దసరాలోనూ కలిసి సందడి చేశారు వీరిద్దరూ. ఇప్పుడు కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఓ వైపు తమిళ సినిమాలు చేస్తూనే, హిందీ సినిమాలకూ సంతకం చేస్తున్నారు. తెలుగులో దసరా తర్వాత భోళా శంకర్‌లో నటించారు కీర్తి. అయినా దసరాలో వెన్నెల కేరక్టర్‌నే గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

లాస్ట్ ఇయర్ ఒకటికి రెండు సినిమాలతో వావ్ అనిపించిన నాని, ఇప్పుడు సరిపోదా శనివారం సెట్స్ మీదున్నారు. ఈ ఏడాది సరిపోదా శనివారంతో రాక్ చేస్తానంటున్నారు నేచురల్ స్టార్. సో, ప్రస్తుతానికి లేకపోయినా, ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఈ కాంబోని భేషుగ్గా ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.




