- Telugu News Photo Gallery Cinema photos Heroine Aishwarya Rajesh latest mesmerizing looks in saree goes viral in social media
Aishwarya Rajesh: ఈ సుకుమారి వంటి లావణ్యం స్వర్గంలో కానరాదు.. మెస్మరైజ్ ఐశ్వర్య..
ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాల్లో ప్రధానంగా పనిచేసే నటి. ఐశ్వర్య నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానాలను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్నెట్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు.
Updated on: Jun 22, 2025 | 9:57 AM

10 జనవరి 1990న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్. ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు. ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు. ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి.

ఈ వయ్యారి తల్లిదండ్రుల నలుగురు సంతంలో ఆమె చిన్నది. వీరిలో ఇద్దరు అన్నలు ఆమె యుక్తవయస్సులో మరణించారు. ఆమె తాత అమర్‌నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు. ఆమె అత్త శ్రీ లక్ష్మి 500 పైగా తెలుగు చిత్రాల్లో హాస్యనటిగా చేసింది.

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.తమిళనాడులో చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బి.కామ్ లో డిగ్రీ పట్ట పొందింది ఈ వయ్యారి భామ.

పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఆమె స్టార్. 2019లో స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాలు చేసింది. ఇవి అంతగా మెప్పించలేదు.

ఈ ఏడాది పండక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి. ప్రస్తుతం కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది.




