- Telugu News Photo Gallery Cinema photos Heroes who say that they can show their Performance as host on small screen
బిగ్ స్క్రీన్ పైనే కాదు.. బుల్లి తెరపై హోస్టులుగా కూడా సత్తా చాటుతాం అంటున్న హీరోలు..
మంచు మనోజ్ కెరీర్ అయిపోయిందా..? ఆయన ఇంక సినిమాలు చేయరా..? రాకింగ్ స్టార్‌లో రాక్ చేసే సత్తా తగ్గిపోయిందా..? ఇదేంటి ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? ఇవన్నీ అడిగింది మనోజే. సినిమాలకు బ్రేకిచ్చిన ఈ హీరో.. తాజాగా రాకింగ్ గేమ్ షోతో వచ్చేస్తున్నారు. మరి మనోజ్‌తో పాటు ఈ మధ్య హోస్టులుగా మారిన హీరోలెవరో చూద్దామా..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 12, 2023 | 1:43 PM

హీరోలను బిగ్ స్క్రీన్ మీద చూడటం కామన్.. కానీ వాళ్లే బుల్లితెరపైకి వస్తే అది సమ్‌థింగ్ స్పెషల్. మారిన కాలంతో పాటే మన హీరోలు కూడా మారిపోతున్నారు. ముఖ్యంగా బిగ్ స్క్రీన్‌తో పాటు డిజిటల్ వరల్డ్‌కూ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో వచ్చేస్తున్నారు. ప్రముఖ ఓటిటిలో డిసెంబర్ 15 నుంచి అది రానుంది. తాజాగా టీజర్ విడుదలైంది.

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ఈ మధ్యే వాట్ ది ఫిష్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. అది సెట్స్‌పై ఉండగానే తాజాగా గేమ్ షోకు హోస్ట్‌గా మారిపోయారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను ప్రజెంట్ చేస్తున్నారు.

ఈయన మాత్రమే కాదు.. విశ్వక్ సేన్ సైతం ఈ మధ్యే ఆహాలో ఫ్యామిలీ ధమాకాతో బాగానే ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో పాటు గేమ్ షోకు డేట్స్ ఇచ్చారు మాస్ కా దాస్.

విశ్వక్ సేన్ కంటే ముందే బాలయ్యను సైతం హోస్టుగా మార్చేసారు ఆహా టీం. అన్‌స్టాపబుల్ షో అయితే ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. మరోవైపు నాగార్జున గురించి చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు చేస్తూనే.. బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ కూడా బుల్లితెరపై కనిపించారు. రానా టాక్ షో బాగా పాపులర్ అయింది. మొత్తానికి మన హీరోలు ఇటూ అటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారిప్పుడు.





























