- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Thalapathy fans exports commercial touch movies after THE Greatest of all times Telugu Heros Photos
Vijay Thalapathy: నెక్స్ట్ ఆ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న విజయ్.! కానీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ వేరే.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన దళపతి, ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా కాకుండా మరో సినిమా మాత్రమే చేస్తానంటూ షాక్ ఇచ్చారు. దీంతో ఆ ఒక్క సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు పదేళ్లుగా నడుస్తోంది.
Updated on: Feb 14, 2024 | 2:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన దళపతి, ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా కాకుండా మరో సినిమా మాత్రమే చేస్తానంటూ షాక్ ఇచ్చారు.

దీంతో ఆ ఒక్క సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు పదేళ్లుగా నడుస్తోంది.

సోషల్ సర్వీస్‌లో ఎప్పుడూ ముందుండే విజయ్, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి.

ప్రజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ సినిమాలో నటిస్తున్న విజయ్, ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి.? ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

లిస్ట్‌లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ కెరీర్‌కు కూడా ఉపయోగపడేలా ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు విజయ్.

అందుకే అలాంటి సినిమాలు చేసే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు లైన్‌లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లిస్ట్‌లో విజయ్ ఎవరికి ఓకే చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వెట్రిమారన్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం లోకేష్, వంశీ పైడిపల్లి లాంటి కమర్షియల్ టచ్ కూడా ఉన్న దర్శకులతో సినిమా చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు.





























