- Telugu News Photo Gallery Cinema photos Hero Naveen Polishetty take time for next movies Telugu Heroes Photos
Naveen Polishetty: మరోసారి అనుదీప్ చేతిలో నవీన్ పోలిశెట్టి.! హ్యాట్రిక్ కొట్టిన నవీన్..
అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదని ఓ అద్భుతమైన మాట రాసారు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో ఓ హీరోను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఏ ఊహకు అందనట్లు హ్యాట్రిక్ కొట్టేసారు. కానీ ఎప్పట్లాగే మళ్లీ సైలెంట్ అయిపోయారు. అసలింతకీ ఎవరా హీరో.. ఏం చేస్తున్నారాయన..? అప్పుడెప్పుడో 12 ఏళ్ళ కింద లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నటుడు నవీన్ పొలిశెట్టి..
Updated on: Dec 02, 2023 | 6:27 PM

అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదని ఓ అద్భుతమైన మాట రాసారు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో ఓ హీరోను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఏ ఊహకు అందనట్లు హ్యాట్రిక్ కొట్టేసారు.

కానీ ఎప్పట్లాగే మళ్లీ సైలెంట్ అయిపోయారు. అసలింతకీ ఎవరా హీరో.. ఏం చేస్తున్నారాయన..? అప్పుడెప్పుడో 12 ఏళ్ళ కింద లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నటుడు నవీన్ పొలిశెట్టి.. కానీ అది ఆయన కెరీర్‌కు యూజ్ కాలేదు.

దాంతో సినిమాల కంటే ముందే యూ ట్యూబ్ వీడియోలతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. చిచోరే సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.. ఇక ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్.

సాయి శ్రీనివాస ఆత్రేయకు కథ, స్క్రీన్ ప్లే అన్నీ నవీన్ రాసుకున్నారు. జాతి రత్నాలుతో ఈయన మార్కెట్ బాగా పెరిగిపోయింది. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతి రత్నాలు కామెడీ సినిమాలకు కల్ట్ అయిపోయింది.

ఈ మధ్యే అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించి మరోసారి మ్యాజిక్ చేసారీయన. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఒక్కో సినిమాకు ఏళ్ళకేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు నవీన్.

ఇప్పుడూ ఇదే చేయబోతున్నారు. అనగనగనా ఒకరాజు సినిమాకు ఎప్పుడో కమిటైనా.. ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లోకి వెళ్లిపోయింది. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు ముందు దర్శకుడు..

కానీ అది జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ చేతుల్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై కూడా క్లారిటీ లేదు. దాంతో మళ్లీ గ్యాప్ తప్పేలా లేదు.




