Nani: నిర్మాతలకు నాని అభయం.. కలెక్షన్లు తో పాటు కాన్ఫిడెన్స్ కూడా.!
సినిమా సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నపుడు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. నిన్నమొన్నటి వరకు కథ డిమాండ్ చేసినా.. మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి.? సినిమా సినిమాకు నాని రేంజ్ పెరుగుతుంది. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు న్యాచురల్ స్టార్.