- Telugu News Photo Gallery Cinema photos Have you seen the latest photos of Bajrangi Bhaijaan Movie Child Artist Harshaali Malhotra?
భజరంగీ భాయ్ మున్నీ పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉన్నదంటే?
భజరంగీ భాయిజాన్ సినిమాలో నటించిన మున్నీ పాపను ఎవరు మర్చిపోతారు చెప్పండి. మూవీలో హీరోకు ఏ మాత్రం తగ్గకుండా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నారి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ మూవీ 2015లో రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన చిన్న పాప హర్షాలీ మల్హోత్ర ఏడేళ్ల వయసులోనే తన నటనతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఇప్పటికీ ఈ మున్నీ అంటే చాలా మందికి ఇష్టం.
Updated on: Feb 15, 2025 | 6:52 PM

భజరంగీ భాయిజాన్ మూవీ విషయానికి వస్తే, పాకిస్తానీకి చెందిన ఓ మూగ చెవిటి పాప మున్నీను తన కన్నవారి వద్దకు చేర్చడానికి భారతీయ యువకుడు ఎన్నిసమస్యలు ఫేస్ చేశాడు అనేది ఈ సినిమా కథ. ఇందులో హర్షాలీ మల్హోత్రా మున్నీ ప్రాతలో నటించగా, సల్మాన్ ఖాన్ భారతీయ యువకుడి పాత్రలో నటించారు.

ఈ మూవీలో మున్నీగా హర్షాలి చాలా క్యూట్‌గా కనిపిస్తూ.. మాటలు లేకున్నా, తన హావభావాలతో అందరినీ కట్టిపడేసింది. సినిమాలో ఈ చిన్నారిని చూసి కంట తడి పెట్టనివారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే? అంతలా మున్నీపాత్రలో ఒదిగిపోయింది ఈ క్యూట్ గర్ల్.

ఇక హర్షాలి మల్హోత్రా ఈ సినిమాకు ముందు పలు సీరియల్స్‌లో నటించింది. కానీ ఏ సీరియల్‌తో రాని ఫేమ్ ఈ చిన్నారికి భజరంగీ భాయ్ జాన్ సినిమాతో వచ్చింది.

హర్షాలి ఈమూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే, భజరంగీ భాయ్ జాన్ సినిమా తర్వాత ఈ క్యూటీ ఏ సినిమాలో కనిపించలేదు. అయితే మూవీ తర్వాత తాను చదువుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, సినిమాలకు దూరంగా ఉందంటూ ఆ రోజుల్లో అనేక వార్తలు వచ్చాయి.

ఇక సినిమాల పరంగా తమ అభిమానులకు దూరంగా ఉన్నా, ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటది. తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో చూడటానికి చాలా అందంగా కనిపించింది హర్షాలి మల్హోత్రా. దీంతో చెవిటి, మోగ పాత్రలో కనిపించిన చిన్నపాపే ఈ అందాల ముద్దుగుమ్మా అంటున్నారు తన అభిమానులు. మరీ మీరు కూడా ఈ ఫోటోస్ పై ఓలుక్ వేయండి.