- Telugu News Photo Gallery Cinema photos Has Pawan Kalyan got a chance to settle his debt for all these years..?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఇన్నాళ్లకు బాకీ తీర్చుకునే అవకాశం వచ్చిందా..?
పవన్ కళ్యాణ్ ఎవరికి బాకీ ఉన్నాడు.. ఎందుకు బాకీ ఉన్నాడు అనుకుంటున్నారు కదా..? ఇదేదో పొలిటికల్ సబ్జెక్ట్ కాదు.. సినిమా సబ్జెక్టే. అయితే ఆయనతో సినిమా అంటే ఇప్పుడు అంత ఈజీ కాదు.. ఎప్పుడు పాలిటిక్స్‌తో బిజీ అవుతాడో.. ఎప్పుడు సినిమా అంటాడో ఆయనకు కూడా తెలియదు పాపం. అలాంటి పవన్‌తో సినిమాలకు మించి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. కానీ త్రివిక్రమ్ ఇదే చేయాలని ప్లాన్ చేస్తున్నాడిప్పుడు.
Updated on: Nov 21, 2023 | 9:28 AM

పవన్ కళ్యాణ్ ఎవరికి బాకీ ఉన్నాడు.. ఎందుకు బాకీ ఉన్నాడు అనుకుంటున్నారు కదా..? ఇదేదో పొలిటికల్ సబ్జెక్ట్ కాదు.. సినిమా సబ్జెక్టే. అయితే ఆయనతో సినిమా అంటే ఇప్పుడు అంత ఈజీ కాదు.. ఎప్పుడు పాలిటిక్స్‌తో బిజీ అవుతాడో.. ఎప్పుడు సినిమా అంటాడో ఆయనకు కూడా తెలియదు పాపం. అలాంటి పవన్‌తో సినిమాలకు మించి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. కానీ త్రివిక్రమ్ ఇదే చేయాలని ప్లాన్ చేస్తున్నాడిప్పుడు.

ఈయన ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. డిసెంబర్ లోపు షూటింగ్ అంతా పూర్తి చేసి.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ వెళ్లాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉంటుందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇంట్రడక్షన్ సీన్ కోసం పవన్ వాయిస్ అయితే బాగుంటుందనేది దర్శక నిర్మాతల ఆలోచన.

అయితే అక్కడున్న వాళ్లంతా పవన్‌కు బాగా కావాల్సిన వాళ్లే కావడంతో.. అది సాధ్యమవ్వడానికి కూడా పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. త్రివిక్రమ్ అడిగినా పవన్ నో చెప్పడు.. తన ఫ్రెండ్ మహేష్ బాబు అడిగినా నో చెప్పడు.. ఎందుకంటే వాళ్లతో పవన్‌కు సపరేట్ బాండింగ్ ఉంటుంది కాబట్టి. పైగా అప్పట్లో పవన్ కళ్యాణ్ జల్సా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమాలో చాలా సీన్స్ మహేష్ వాయిస్‌తోనే రన్ అవుతాయి. సినిమాకు అది బాగా హెల్ప్ అయింది కూడా.

ఇప్పుడు పవన్‌తో అలాగే డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందనేది త్రివిక్రమ్ ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే పవన్‌తో ఈ వాయిస్ మ్యాటర్ గురించి త్రివిక్రమ్ చర్చించినట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచి కూడా పాజిటివ్ నోట్ వచ్చిందని.. త్వరలోనే పవన్ కూడా ఈ వాయిస్ చెప్పబోతున్నాడనేది దీని సారాంశం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పవన్, మహేష్ ఫ్యాన్స్‌కు అంతకంటే పండగ మరోటి లేదు. పైగా జల్సా బాకీ కూడా ఇప్పుడు పవన్ తీర్చుకున్నట్లవుతుంది.

గుంటూరు కారంపై అంచనాలు మామూలుగా లేవు.. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు అభిమానులు. పండక్కి అరడజన్ సినిమాలు వస్తున్నా.. అందరి చూపు కూడా గుంటూరు కారంపైనే ఉంది. మరి చూడాలిక.. అన్నీ కుదిరి పవన్ వాయిస్ కూడా తోడైతే గుంటూరు కారం రేంజ్ మరింత పెరగడం ఖాయం. ఇందులో ముందు పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నా.. మధ్యలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయింది. శ్రీలీలను అనుకున్న ప్లేస్‌కు మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.




