- Telugu News Photo Gallery Cinema photos Global star ram charan tej increasing his fan following with meeting them
Ramcharan: గ్లోబల్ స్టార్ నయా స్ట్రాటజీ… ఫ్యాన్స్ తో ములాఖత్ అందుకేనా
ఒకటే పడవ మీద ప్రయాణం చేసే రోజులు లేవిప్పుడు. ఏ పని చేసినా.. పుణ్యం పురుషార్థం రెండూ దక్కాల్సిందే. ఈ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. ఆయన ఏం చేసినా పర్సనల్‌గానూ, ప్రొఫెషనల్‌గానూ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మేకర్స్ అడిగిన కాల్షీట్లు పంచేసి, సినిమాలు చేయడం ఎంత సేపూ... ఎవరైనా చేస్తారు. ప్రాజెక్ట్ విషయంలో అంతకు మించి ఏం చేశామన్నదే కదా..ఎప్పుడైనా కౌంట్‌లోకి వచ్చేది.
Updated on: Aug 20, 2024 | 9:48 PM

నాన్‌స్టాప్ ప్రమోషన్లతో నెవర్ బిఫోర్ పబ్లిసిటీ చేయాలన్నది శంకర్ ప్లాన్. ఒన్స్ ఆడియన్స్ కి మూవీ రీచ్ అయితే, బాక్సాఫీస్ నెంబర్లను వారే గ్రాండ్‌గా చూపిస్తారన్నది ఆయనకున్న స్ట్రాటజీ.

రామ్‌చరణ్ కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారా? దేని తర్వాత ఏం చేయాలో ఆయనకు ఆల్రెడీ క్లారిటీ ఉందా? ఆ ప్లాన్ ప్రకారమే మూవ్ అవుతున్నారా? ఆయన ప్రెజెంట్ ఫిల్మోగ్రఫీని దగ్గరగా గమనిస్తున్న వారందరూ ఈ విషయం గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

ట్రిపుల్ ఆర్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసిన వారు, మరేం ఫర్వాలేదు... ఇక ఎలాంటి రోల్‌లో అయినా చరణ్ ఇరగదీస్తాడు అని ఫిక్సయ్యారు. ఆ రేంజ్‌లో మెప్పించారు చెర్రీ. ఎమోషన్స్, యాక్షన్, డిక్షన్.. అన్నిటిలోనూ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

గ్లోబల్‌స్టార్ అనే పేరు ఎవరికీ మామూలుగా రాదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం గట్టిగానే కనిపిస్తోంది రామ్‌చరణ్‌లో. ఎక్కడికి వెళ్లినా అభిమానులను కలుస్తూ స్పెషల్‌గా విష్ చేస్తూ, ఓవర్సీస్‌లో ఫ్యాన్ బేస్‌ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్లతో రికార్డులు కొల్లగొట్టాలంటే, ఏ రీజన్‌నీ తక్కువగా చూడటానికి వీల్లేదు. ప్రతి చోటా ఫ్యాన్ బేస్ ఉండాల్సిందే. ఆ విషయాన్ని గమనించారు కాబట్టే, ఆ పనిని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మా చెర్రీ అంటూ పొంగిపోతున్నారు అభిమానులు.




