హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. డిసెంబర్ 4న నేషనల్ నేవి డే సందర్భంగా ఫైటర్‌లో ఫ్యాటి పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 25న విడుదల కానుంది ఫైటర్.