- Telugu News Photo Gallery Cinema photos Do You Know Rakshit Shetty Work Before He Coming In To industry And His First Salary
Rakshit Shetty: సినిమాల్లోకి రాక ముందు రక్షిత్ శెట్టి ఏం చేసేవాడో తెలుసా? ఫస్ట్ శాలరీ అంత తక్కువనా?
కన్నడ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడే శ్రీమన్నారాయణ, ఛార్లీ 777, ఇటీవల సప్త సాగరాలు దాటి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడీ హ్యాండ్సమ్ హీరో. సమకాలీన నటుల్లా మాస్ డైలాగ్స్, హీరోయిజం, కమర్షియల్ సినిమాల వెనక పడకుండా ఫీల్ గుడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రక్షిత్ శెట్టి.
Basha Shek | Edited By: Shaik Madar Saheb
Updated on: Nov 12, 2023 | 7:37 AM

కన్నడ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడే శ్రీమన్నారాయణ, ఛార్లీ 777, ఇటీవల సప్త సాగరాలు దాటి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడీ హ్యాండ్సమ్ హీరో. సమకాలీన నటుల్లా మాస్ డైలాగ్స్, హీరోయిజం, కమర్షియల్ సినిమాల వెనక పడకుండా ఫీల్ గుడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రక్షిత్ శెట్టి.

కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న రక్షిత్ తన సంస్థ ద్వారా కొన్ని మంచి సినిమాలు ఇచ్చాడు. ప్రస్తుతం కన్నడ నాట అతనికి ఫుల్ డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే సినిమాల్లోకి రాక ముందు రక్షిత్ ఏం చేసేవాడు, ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా?

రక్షిత్ శెట్టి సినిమాల్లోకి రాకముందు ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. రక్షిత్ శెట్టి తొలి ఐటీ ఉద్యోగంలో మొదటి నెల జీతం 12 వేలు. అంతకు ముందు కూడా రక్షిత్ శెట్టి పని చేశాడు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారు. అతి చిన్న వయసులోనే కారు నడపడం నేర్చుకున్న రక్షిత్ శెట్టి తన తండ్రి పనిచేసే చోటికి సిమెంట్ బస్తాలను తీసుకెళ్లేవాడట.

'నమ్ ఏరియల్ ఒండ్ దిన' సినిమాలో రక్షిత్ శెట్టి చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘తుగ్గక్’. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘సింపుల్ ఆగ్ వన్ లవ్ స్టోరీ’. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత రక్షిత్ శెట్టి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇటీవలే సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ సినిమాతో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు రక్షిత్ శెట్టి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ పేరుతో నవంబర్ మూడో వారంలో ఈ మూవీ రిలీజ్ కానుంది.