- Telugu News Photo Gallery Cinema photos Do you know About Actor Arjun Second Duaghter Anjana Arjun What She is Doing Now look Her Photos
Anjana Arjun: హీరో అర్జున్ చిన్న కూతురు ఏం చేస్తుందో తెలిస్తే షాకే.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ సర్జా. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ చిన్న కూతురు అంజన అర్జున్ మాత్రం బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తండ్రి, అక్క మాదిరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా వ్యాపారవేత్తగా రాణిస్తుంది. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Jun 01, 2024 | 1:05 PM

సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ సర్జా. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ చిన్న కూతురు అంజన అర్జున్ మాత్రం బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

తండ్రి, అక్క మాదిరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా వ్యాపారవేత్తగా రాణిస్తుంది. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను స్టార్ట్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ రంగంలోకి కొత్త ప్రయోగాలు చేస్తుంది.

కొన్నాళ్ల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంజనా అర్జున్ హ్యాండ్ బ్యాగ్ తయారీ సంస్థను ప్రారంభించి ఆమెను అభినందించారు. అంజనా హ్యాండ్ బ్యాగ్స్ తయారికి పండ్ల తొక్లను ఉపయోగిస్తుంది.

పండ్ల తొక్కలను వాడే ప్రత్యేకమైన ఫార్ములాతో ఈ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తుంది. ఈ పద్దతిని ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు ఉపయోగించలేదు. మొదటిసారిగా అంజనా అర్జున్ ఉపయోగిస్తుంది.

వ్యాపారవేత్తగా రాణిస్తున్న అంజనా.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తు నెట్టింట సందడి చేస్తుంది. అలాగే అందంలో అచ్చం హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం అంజనా అర్జున్ ఫోటోస్ వైరలవుతున్నాయి.




