- Telugu News Photo Gallery Cinema photos Heroine Neha shetty compare with bollywood shahrukh khan with her radhika name
Neha Shetty: షారుఖ్ తో పోల్చుకున్న రాధిక.. అందుకే అన్ని అలాంటి క్యారెక్టర్స్..
బాలీవుడ్ బాద్షాకి, టిల్లు రాధికకీ ఓ మంచి పోలిక చెబుతున్నారు మిస్ నేహా శెట్టి. అదెలా సాధ్యం? ఒకవేళ కుదిరిందనే అనుకున్నా... ఏ విషయంలో... ఇలా రకరకాల అనుమానాలకు తెర తీసేశారు నేహా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న నేహా.. ఈ మధ్య మీడియా ముందుకు తరచూ వచ్చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నైన్‌టీస్ టైమ్ రిచ్ కిడ్‌గా కనిపిస్తారు నేహా శెట్టి.
Updated on: Jun 01, 2024 | 12:12 PM

బాలీవుడ్ బాద్షాకి, టిల్లు రాధికకీ ఓ మంచి పోలిక చెబుతున్నారు మిస్ నేహా శెట్టి. అదెలా సాధ్యం? ఒకవేళ కుదిరిందనే అనుకున్నా... ఏ విషయంలో... ఇలా రకరకాల అనుమానాలకు తెర తీసేశారు నేహా.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న నేహా.. ఈ మధ్య మీడియా ముందుకు తరచూ వచ్చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నైన్‌టీస్ టైమ్ రిచ్ కిడ్‌గా కనిపిస్తారు నేహా శెట్టి.

ఇప్పటిదాకా తనకున్న ఇమేజ్‌ని ఈ సినిమా కంప్లీట్‌గా మార్చేసిందని అంటారు నేహా శెట్టి. సౌమ్యంగా, అందంగా కనిపించినా, దృఢమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిగా కనిపిస్తారట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో.

అంతే కాదు, ఈ చిత్రంలో నేహ కేరక్టర్ కోసం అలనాటి నటి శోభన లుక్‌నీ, యాక్టింగ్‌ని రెఫరెన్స్ గా తీసుకున్నారట మేకర్స్. డీజే టిల్లులో చేసిన రాధిక కేరక్టర్ పేరుతోనే ఇప్పటికీ జనాలు తనను పిలుస్తుంటారని గుర్తుచేసుకుంటున్నారు నేహా.

తనని ఎవరైనా రాధిక అని పిలిస్తే, బాలీవుడ్‌లో షారుక్ ని బాద్‌షా అని పిలిచినంత ఆనందంగా ఉంటుందని అన్నారు. రాధిక కేరక్టర్ చేసిన తర్వాత పర్సనల్ లైఫ్‌లోనూ మంచి మార్పు కనిపించిందని చెబుతున్నారు నేహా.

చీరలు కట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నానని అన్నారు. గతంతో పోలిస్తే చీరకట్టు సౌకర్యవంతంగా అనిపిస్తోందని., తనకు చీరకట్టులో ఉన్న పాత్రలే వస్తున్నాయని.,

తాను కూడా ఇష్టంగా చేస్తున్నానని చెప్పారు. నెక్స్ట్ బెల్లంకొండతో చేస్తున్న మూవీలో మాత్రం కంప్లీట్ మోడ్రన్ గర్ల్ గా కనిపిస్తారట ఈ బ్యూటీ..




