6 / 6
ఇప్పటికే సీనియర్ హీరోలలో వెంకటేష్, బాలయ్యతో పని చేసి సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్.. ఇప్పుడు చిరుతోనూ అదే చేయాలని చూస్తున్నాడు. మరోవైపు తన బ్యానర్‌లో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేయాలనేది దిల్ రాజు కోరిక. ఇప్పటికే మహేష్, పవన్ సహా ఈ జనరేషన్ హీరోలందరితోనూ దిల్ రాజు సినిమాలు నిర్మించాడు. బాలయ్య, చిరంజీవి బ్యాలెన్స్ అంతే. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తానంటున్నాడు రాజు. ఈ కాంబినేషన్‌ను అనిల్ రావిపూడి కలిపేలా కనిపిస్తున్నాడు. మరి నిజంగానే చంటబ్బాయి లాంటి ఎంటర్‌టైనర్ వస్తే మాత్రం అనిల్ రావిపూడికి సదా రుణపడి ఉంటారు మెగా అభిమానులు.