- Telugu News Photo Gallery Cinema photos Comedians who are not only doing comedy but also showing their ability in direction
కామెడీ పండించడమే కాదు.. మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తామంటున్నారు కమెడియన్స్..
ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు..? సత్తా ఏంటో తెలియకుండా ముందుగానే అంచనా వేయడం చాలా తప్పు. ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. నవ్విస్తున్నారు కదా.. వాళ్లకది తప్ప ఇంకేం రాదనుకుంటే పొరపాటే. తాజాగా బలగం వేణు దారిలోనే మరో జబర్దస్త్ కమెడియన్ మెగాఫోన్ పట్టారు. మరి ఆయనెవరు..?
Praveen Vadla | Edited By: Shaik Madar Saheb
Updated on: Jan 23, 2024 | 5:09 PM

బలగం సినిమాకు ముందు వేణు అంటే కేవలం కమెడియన్ మాత్రమే. అది కూడా స్టార్ కమెడియన్ కాదు.. అప్పుడప్పుడూ సినిమాల్లో.. ఎప్పుడూ టీవీలో కనిపించే చిన్న కమెడియన్.

కానీ ఇప్పుడు ఆయన మంచి దర్శకుడు. బలగంతో వేణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నటుడిగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే వేణు దర్శకుడిగా మారిపోయారు.

బలగం తర్వాత రెండో సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలోనే స్టార్ హీరోతో చేయబోతున్నారు వేణు. తాజాగా వేణు దారిలోనే ఆయన ఫ్రెండ్ ధన్‌రాజ్ కూడా దర్శకుడుగా మారిపోయారు.

తాజాగా ధన్‌రాజ్ తన కథతో సముద్రఖని లాంటి నటుడిని మెప్పించారు. హీరో, కమెడియన్, నిర్మాత అన్నీ ట్రై చేసినా ధన్‌రాజ్‌కు ఫలితం దక్కలేదు. దాంతో దర్శకుడిగా మారి రామం రాఘవం అనే సినిమా చేస్తున్నారు.ఇందులో సముద్రఖని తండ్రిగా నటిస్తుంటే. ధన్‌రాజ్ కొడుకుగా నటిస్తున్నారు. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రామం రాఘవం వస్తుంది.

గతంలో జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్ శ్రీధర్ కూడా దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. ఇక కమెడియన్లలో చూసుకుంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, ఎమ్మెస్ నారాయణ లాంటి వాళ్ళు కూడా గతంలో మెగాఫోన్ పట్టినవాళ్లే. ఇప్పుడు ధన్‌రాజ్ ఏం చేస్తారో చూడాలిక.





























