Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలసిన ఇండస్ట్రీ పెద్దలు ఎందుకంటే ??
పవన్ కళ్యాణ్ పవర్‌లోకి రావడంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయా..? జనసేనాని వల్ల తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎంత మంచి జరగబోతుంది..? వందల కోట్లతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఊరట లభించనుందా..? పవన్ కళ్యాణ్‌ను ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలిసినట్లు..? నిర్మాతలు ఆయనతో ఏం ముచ్చటించారు..?
Updated on: Jun 24, 2024 | 11:09 PM

పవన్ కళ్యాణ్ పవర్‌లోకి రావడంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయా..? జనసేనాని వల్ల తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎంత మంచి జరగబోతుంది..? వందల కోట్లతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఊరట లభించనుందా..? పవన్ కళ్యాణ్‌ను ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలిసినట్లు..? నిర్మాతలు ఆయనతో ఏం ముచ్చటించారు..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతల భేటీ.. గంటకు పైగానే సాగిన చర్చలు..! టాలీవుడ్‌లో ఇదే హెడ్ లైన్ ఈరోజు. ఎవర్ని కదిపినా.. ఎక్కడ కదిలించినా దీనిపైనే చర్చ.

పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాతలంతా ఒకేసారి కలవడంపై ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే వాళ్లు మాత్రం కేవలం అభినందించడానికే అంటున్నారు. పవన్ కళ్యాణ్‌ని కలిసిన వాళ్లలో అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.అశ్వినీదత్, ఏ.ఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీ వాస్, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టిజి.విశ్వప్రసాద్ తదితరులున్నారు.

విజయవాడ క్యాంప్ ఆఫీసులో జనసేనానితో భేటీ అయ్యారు నిర్మాతలు. ఇందులో ఇండస్ట్రీ సమస్యలపై చర్చ కాదు.. సిఎం అప్పాయింట్‌మెంట్ కోసమే చర్చ జరిగిందన్నారు.

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూట్ తుక్కు గూడలో జరుగుతున్నాయి. నాగార్జున, ధనుష్ నటిస్తున్న కుబేరా షూటింగ్ ఒకేసారి ముంబైతో పాటు ఉప్పల్‌లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్.