Ramcharan-Chiranjeevi Combo: చరణ్ సినిమాలో చిరు.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటున్న మెగా అభిమానులు..
కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ మెగా లెవల్లో ఉంటుంది. ఆ కాంబో ఇంతకు ముందు హిట్ అయిందా? ఫట్ అందా... ఇలాంటి లెక్కలు అసలు పనిచేయవు. కాంబో కుదురుతోందనే మాటే కిక్ ఇచ్చేస్తుంది. గతాన్ని మర్చిపోయేలా చేస్తుంది. త్వరలోనే మెగా కాంపౌండ్‌లో అలాంటి కాంబినేషన్ కుదురుతుందనే వార్త తెలిసి ఫ్యాన్స్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్... వీళ్లిద్దరినీ జస్ట్ పాటలోనో, ఫ్లోర్ మీద కొన్ని స్టెప్పుల్లోనో కాదు, అంతకు మించిన స్పేస్‌లో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఆ కలను ఫ్రెష్‌గా నెరవేర్చే పనిలో ఉన్నారట బుచ్చిబాబు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Sep 06, 2023 | 4:40 PM

కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ మెగా లెవల్లో ఉంటుంది. ఆ కాంబో ఇంతకు ముందు హిట్ అయిందా? ఫట్ అందా... ఇలాంటి లెక్కలు అసలు పనిచేయవు. కాంబో కుదురుతోందనే మాటే కిక్ ఇచ్చేస్తుంది. గతాన్ని మర్చిపోయేలా చేస్తుంది.

త్వరలోనే మెగా కాంపౌండ్‌లో అలాంటి కాంబినేషన్ కుదురుతుందనే వార్త తెలిసి ఫ్యాన్స్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటున్నారు. అయితే చిరు చెర్రీ కంబో కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్... వీళ్లిద్దరినీ జస్ట్ పాటలోనో, ఫ్లోర్ మీద కొన్ని స్టెప్పుల్లోనో కాదు, అంతకు మించిన స్పేస్‌లో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఆ కలను ఫ్రెష్‌గా నెరవేర్చే పనిలో ఉన్నారట బుచ్చిబాబు. ఈ సారి కాంబినేషన్... ఆచార్యలాగా మాత్రం ఉండదు అనే నమ్మకాన్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నారట కెప్టెన్.

ఆల్రెడీ ఆచార్యలో భలే భలే భంజారా అంటూ మెప్పించే ప్రయత్నం చేశారు ఫాదర్ అండ్ సన్. అయితే ఆ సినిమా ఎక్కడో మిస్‌ఫైర్ అయింది. ఆచార్యలో సిద్ధను పెంచిన గురువుగా నటించారు మెగాస్టార్. ఈ సారి బుచ్చిబాబు చెప్పిన కేరక్టర్ కూడా అలాంటిదేనట. ఈ మూవీలోనూ గురువు కేరక్టరే చేయబోతున్నారట చిరు.

రామ్‌చరణ్ కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రాసుకున్నారు బుచ్చిబాబు. కీలక సన్నివేశంలో ఆయన్ని మోటివేట్ చేసే గురువుగా చూపిస్తారట మెగాస్టార్‌ని. ఈ సినిమాతో ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయన్నది వైరల్ అవుతున్న న్యూస్.

ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు రామ్‌చరణ్. చిరంజీవి నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం గురించి ఇంకా క్లారిటీ లేదు. దీంతో కొడుకు సినిమాలో కేరక్టర్ చేయడానికి మెగాబాస్ ఓకే చెప్పే స్కోప్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ సారి బొమ్మ బ్లాక్‌బస్టర్ చేయడానికి మేం ఉన్నాం అంటున్నారు మెగా ఆర్మీ.





























