- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo She Is National Actress Rashmika Mandanna
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఒక్కో సినిమా రూ.100 కోట్లు దాటాల్సిందే.. ఇప్పుడు కుర్రాళ్ల కలల సుందరి..
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. సహజ నటనతో నటిగా ప్రశంసలు అందుకుంటున్న ఈ బ్యూటీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. తెలుగువారికి ఇష్టమైన అమ్మడు. ఎవరో తెలుసా..
Updated on: Jun 21, 2025 | 6:42 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మారుమోగుతున్న పేరు. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం హిందీ, తెలుగు భాషలలో వరుస సినిమాలతో హిట్స్ అందుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.

ఇప్పటికే పుష్ప 2, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో మరోసారి తనదైన నటనతో మెప్పించింది. రష్మిక మందన్నా నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

ఏప్రిల్ 5న కర్ణాటకలోని కోటక్ జిల్లా విరాజ్ పేటలో జన్మించిన రష్మిక.. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతా గోవిందం మూవీతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు హిందీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

కుబేర సినిమాలో రష్మిక నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే హిందీలో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం.




