- Telugu News Photo Gallery Cinema photos Bro success celebrations and businessman movie to rerelease soon in 4K
విజయోత్సావ యాత్రలో ‘బ్రో’.. థియేటర్లలో రీ రిలీజుల సందడి..
'బ్రో' సినిమా విజయయాత్రలో పాల్గొంటున్నారు హీరో సాయిధరమ్‌తేజ్. ఈ యాత్రలో భాగంగా ఆయన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా 'బ్రో'. ఈ చిత్రం ఫన్నీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Updated on: Aug 01, 2023 | 7:35 PM

Businessman 4k 8 days to go: థియేటర్లలో రీ రిలీజుల సందడి కొనసాగుతూనే ఉంది. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్‌ని ఆగస్టు 4న విడుదల చేయనున్నారు. మహేష్‌బాబు నటించిన బిజినెస్‌మేన్ ఈ నెల 9న విడుదల కానుంది.

Jawan song: జవాన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. దుమ్మే దులిపేలా అంటూ సాగే ఈ పాటలో షారుఖ్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

Malavika mohanan: బోల్డ్ స్టేట్‌మెంట్లతో తరచూ వార్తల్లో ఉంటారు నటి మాళవిక మోహనన్. లేటెస్ట్ గా 500 కోట్లు వసూళ్లు చేసే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. కథలో తన పాత్రకు ఇంపార్టెన్స్ లేని పక్షంలో భారీ బడ్జెట్ సినిమాలకు కూడా నో చెప్పేస్తానని అన్నారు మాళవిక.

Sai dharam tej: 'బ్రో' సినిమా విజయయాత్రలో పాల్గొంటున్నారు హీరో సాయిధరమ్‌తేజ్. ఈ యాత్రలో భాగంగా ఆయన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా 'బ్రో'. ఈ చిత్రం ఫన్నీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Skanda song promo: రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. నీ చుట్టూ చుట్టూ అనే పాటకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది స్కంద. వచ్చే నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




