
గతంలో వివిధ సీజన్లలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న దేత్తడి హారిక, దీప్తి సునైనా, మెహ బూబ్ దిల్ సేలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

బుధవారం (నవంబర్ 13) ఉదయం శ్రీవారి ఆలయ నిబంధనల సంప్రదాయ వస్త్రాలు ధరించి ఏడు కొండల స్వామిని దర్శించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు హారిక, దీప్తి సునైనా, మెహ బూబ్. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఇందులో ముఖ్యంగా చీరలో ఎంతో అందంగా కనిపించింది హారిక. యూట్యూబ్ స్టార్ గా ఫేమస్ అయిన ఆమె బిగ్ బాస్ సీజన్ 4లో సందడి చేసింది.

ఇక దీప్తి సునైనా బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. అలాగే మెహబూబ్ దిల్ సే కూడా రెండు సార్లు బిగ్ బాస్ షో కు వెళ్లి వచ్చాడు.