
బిగ్‌బాస్ సీజన్ 9తో దమ్ము శ్రీజ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈసారి సీజన్ లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటే గుర్తొచ్చే పేరు తనదే. అయితే ఆమె ఎలిమినేషన్ అన్యాయంగా జరిగిందంటూ ఫ్యాన్స్ ఆరోపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసమే దమ్ము శ్రీజను బయటకు పంపించారని.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కనీసం ఆమె జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా హౌస్ నుంచి పంపివేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీజ హౌస్ లో ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లు సైతం ఆమెను అన్యాయంగా బయటకు పంపించారని.. కచ్చితంగా శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

శ్రీజ ఎలిమినేషన్ ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికీ శ్రీజ రీఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ జర్నీ గురించి వరుస పోస్టులు చేస్తుంది శ్రీజ. ఇటీవల తాను రీఎంట్రీ అని వస్తున్న వార్తలపై శ్రీజ దమ్ము క్లారిటీ ఇచ్చింది. ఎలిమినేట్ అవుతానని తాను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది.

ఫస్ట్ రెండు వారాలు తాను జనాలకు నచ్చలేదని.. ఆ తర్వాత ఆట తీరు మార్చుకున్నానని.. ఫిజికల్ టాస్కులలో గట్టిపోటీ ఇచ్చానని.. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యానని ఎమోషనల్ అయ్యింది. తన జర్నీ వీడియో ప్లే చేయలేదని .. దీంతో రీఎంట్రీ ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారని.. అయితే బాగానే ఉంటుందని చెప్పుకొచ్చింది.

అయితే రీఎంట్రీ ఉంటే ఖచ్చితంగా వెళ్తానని.. రీఎంట్రీ లేకపోతే చేసేదేం లేదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో శ్రీజ దమ్ము రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఈ వీకెండ్ లో ఆమె కచ్చితంగా రీఎంట్రీ ఇవ్వనుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈవారం డేంజర్ జోన్ లో రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష ఉన్నారు.