Tollywood News: వంద కోట్ల క్లబ్‌లో భగవంత్ కేసరి.. మరోసారి పవర్ ఫుల్ కాంబినేషన్ లో రానున్న రవి తేజ
తనకు కలిసొచ్చిన దర్శకుడితో నాలుగో సినిమా ప్రకటించారు రవితేజ. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్‌లో ఈ సినిమా రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం 6 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్.. 50 కోట్ల షేర్ వసూలు చేసింది. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత వరసగా మూడో 100 కోట్ల సినిమా ఇది. ఈ సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు మేకర్స్. విడుదలైన 5 రోజుల తర్వాత దంచవే మేనత్త కూతురా సాంగ్ కూడా యాడ్ చేసారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




