మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్ . ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ. ఆతర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో యంగ్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.