అనిరుధ్ ఓ సినిమాకు పని చేస్తున్నాడంటే చాలు దర్శక నిర్మాతలకు టెన్షన్ తప్పట్లేదు. అలా అంటారేంటి.. మనోడు ఇచ్చే మ్యూజిక్‌తో సినిమాల రేంజ్ మారిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ మ్యూజిక్‌తో ఏ సమస్యా లేదు.. కానీ మరో విషయంలో మాత్రం మేకర్స్‌ను కంగారు పెడుతున్నారు అనిరుధ్. తాజాగా వేట్టయన్‌కు ఇది తప్పట్లేదు.
అనిరుధ్ రవిచందర్.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మనోడి పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు.. పూనకాలు వచ్చినట్లు ఊగిపోతుంటారు ఆడియన్స్.. తన మ్యూజిక్‌తో అలా ఉరకలెత్తిస్తుంటారు అని.
అంతా బానే ఉంది కానీ ఒక్క విషయంలో అనిరుధ్ నుంచి దర్శక నిర్మాతలకు టెన్షన్ తప్పట్లేదు. అదే మనోడు ఇచ్చే రివ్యూ..! రాజమౌళి ముద్రలా.. తను పని చేసే సినిమాలపై అనిరుధ్ ముద్ర ఉంటుంది.
రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెడతారు అని. అలా పెడితే సినిమాకు తిరుగులేదని అర్థం. కొన్నేళ్లుగా ఇదే సెంటిమెంట్ అయిపోయింది మేకర్స్‌కు.
జైలర్, లియో, దేవర లాంటి సినిమాలకు ముందుగానే ఇలా ట్వీట్ చేసారు అనిరుధ్.. అవన్నీ రప్ఫాడించాయి. తాజాగా వేట్టయన్‌పై కూడా అనిరుధ్ ముద్ర పడింది. నిజానికి రజినీ గత సినిమాలతో పోలిస్తే.. దీనిపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయితే వారం రోజుల కిందే RR పూర్తయ్యాక ట్వీట్ వేసారు అనిరుధ్. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.