ఓ వైపు విశ్వంభరతో బిజీగా ఉన్నా.. మరోవైపు అనిల్ రావిపూడితోనూ టచ్‌లోనే ఉన్నారు మెగాస్టార్. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ అప్‌డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు మెగాస్టార్.
తాజాగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయిందన్నారీయన. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి కథతోనే వస్తున్నామంటూ అభయమిచ్చారు అనిల్.
ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి సబ్జెక్ట్ ఇది అంటున్నారీయన. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేలా ఎంటర్‌టైన్మెంట్ పక్కా అంటున్నారు అనిల్ రావిపూడి. మరో నెల రోజుల్లో కథ మొత్తం పూర్తవుతుందని చెప్పారీ దర్శకుడు. చిరంజీవి అంటే డాన్స్‌లు, ఫైట్లు ఊహిస్తారు ఫ్యాన్స్. మన సినిమాలో ఉండేవే అవి.. మీరేం కంగారు పడకండి అంటున్నారు అనిల్.
అయితే లవ్ ట్రాక్, డ్యూయెట్స్ లాంటివి కాకుండా సిచ్యువేషనల్ కామెడీతో పాటు పాటలు కూడా కథలో కలిసిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. రాయలసీమ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇంద్ర సినిమానే. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది ఇంద్ర.
మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత చిరు కోసం సీమ కథ సిద్ధం చేస్తున్నారు అనిల్. కాకపోతే ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సమ్మర్ తర్వాత షూట్ మొదలుపెట్టి.. సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేసారు అనిల్.