ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్ప రాజ్ లాగేసుకుంటాడా..? ఇప్పటి వరకు ఎంతొచ్చింది..?
బాలీవుడ్‌లో 700 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇదే ఏడాది స్త్రీ 2 తొలిసారి 600 కోట్ల క్లబ్బులో చేరింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన స్త్రీ 2 ఫస్ట్ డే నుంచే రికార్డులు తిరగరాసింది.
ఇక బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్ మొదలు పెట్టిన సినిమా బాహుబలి 2. 2017లో ఈ చిత్రం తొలిసారి 500 కోట్లకు పైగా వసూలు చేసింది.. 400 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమా కూడా బాహుబలి 2నే.
బాలీవుడ్‌కు 300 కోట్ల సినిమాను పరిచయం చేసింది అమీర్ ఖాన్. 2014లో ఈయన నటించిన PK సినిమా తొలిసారి 300 కోట్లు వసూలు చేసింది. ఇక 2009లో విడుదలైన 3 ఇడియట్స్ తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది.
కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలట్లేదు పుష్ప రాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా.. అన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నాడు.