వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఆదికేశవ సినిమా నవంబర్ 10 నుంచి 24 వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ 4 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్‌గా ఆదికేశవ వస్తుంది.