- Telugu News Photo Gallery Cinema photos Actress who will be acted with Ram Pothineni and Sanjay Dutt in Double Ismart is Kavya Thapar
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ పై పూరీ సస్పెన్స్ డ్రామా.. రామ్‌తో జోడీ కట్టబోయే భామ ఎవరంటే ??
మామూలుగానే తన సినిమా ప్రమోషన్ పీక్స్‌లో చేసుకుంటారు పూరీ జగన్నాథ్. కానీ ఎందుకో మరి డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం ప్రతీ విషయాన్ని పెళ్లి కూతుర్ని దాచేసినట్లు దాచేస్తున్నారు. ఏ ముచ్చటా పక్కాగా చెప్పట్లేదు. ముందేమో మ్యూజిక్ డైరెక్టర్ మ్యాటర్ దాచారు.. ఇప్పుడేమో హీరోయిన్ విషయంలో సస్పెన్స్..! అసలు డబుల్ ఇస్మార్ట్‌లో రామ్‌తో జోడీ కట్టబోయే భామెవరు..? వరస ఫెయిల్యూర్స్‌తో రేసులో బాగా వెనకబడిపోయారు రామ్. ఒకదాన్ని మించి మరో సినిమా షాక్ ఇస్తున్నాయి ఈయనకు.
Updated on: Nov 04, 2023 | 6:38 PM

మామూలుగానే తన సినిమా ప్రమోషన్ పీక్స్‌లో చేసుకుంటారు పూరీ జగన్నాథ్. కానీ ఎందుకో మరి డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం ప్రతీ విషయాన్ని పెళ్లి కూతుర్ని దాచేసినట్లు దాచేస్తున్నారు. ఏ ముచ్చటా పక్కాగా చెప్పట్లేదు. ముందేమో మ్యూజిక్ డైరెక్టర్ మ్యాటర్ దాచారు.. ఇప్పుడేమో హీరోయిన్ విషయంలో సస్పెన్స్..! అసలు డబుల్ ఇస్మార్ట్‌లో రామ్‌తో జోడీ కట్టబోయే భామెవరు..?

వరస ఫెయిల్యూర్స్‌తో రేసులో బాగా వెనకబడిపోయారు రామ్. ఒకదాన్ని మించి మరో సినిమా షాక్ ఇస్తున్నాయి ఈయనకు. ముందు లింగుసామి ది వారియర్.. మొన్న స్కంద.. రెండింటిపై భారీ అంచనాలున్నాయి. కానీ ఏదీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేదు. బోయపాటి మేనియాతో పాన్ ఇండియన్ హీరో అయిపోదాం అనుకున్నా.. స్కంద ఆ కలలు తీర్చలేదు. దాంతో ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్‌పైనే ఉన్నాయిప్పుడు.

పూరీ జగన్నాథ్ కూడా ప్లాపుల్లోనే ఉన్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టారీయన. ముంబైలోనే ఎక్కువ భాగం షూట్ చేస్తున్నారు.

ఇప్పటికే అక్కడ ఓ సాంగ్, హీరో ఇంట్రో ఫైట్ తీశారు. నవంబర్ 13 నుంచి ముంబైలోనే మరో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూట్ ఉంటుంది. మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు.

ముందు మ్యూజిక్ డైరెక్టర్‌పై సస్పెన్స్ మెయింటేన్ చేసి టీం.. ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో రామ్‌కు జోడీగా కావ్య తప్పర్ నటిస్తున్నారు. ఏక్ మినీ కథతో పరిచయమైన ఈ భామ.. ఈ మధ్యే విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2లో నటించారు. కెరీర్ డల్‌గా ఉన్న టైమ్‌లో డబుల్ ఇస్మార్ట్ ఈమెకు బూస్టప్ లాంటిదే. మార్చ్ 8, 2024న విడుదల కానుంది ఈ చిత్రం.




