- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela will takes short break to movies for her MBBS Exams telugu cinema news
Sreeleela: సినిమాలకు రెండు నెలలు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల ?.. ఎందుకంటే..
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అంతేకాదు..
Updated on: Aug 22, 2023 | 7:04 PM

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అంతేకాదు.. ఈముద్దుగుమ్మకు మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రీలీల చేతిలో 10 సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇప్పటికే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది శ్రీలీల. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కెరియర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటుంది శ్రీలీల.

అయితే ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూనే.. మరోవైపు రెండు నెలల గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రిపరేషన్ మోడ్ లోకి వచ్చేస్తుందట.

ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ ఏడాదితో పూర్తికానుంది. అందుకే పరీక్షల కోసం రెండు నెలల సమయం కేటాయించి ప్రిపేర్ అవుతుందని సమాచారం.




