- Telugu News Photo Gallery Cinema photos Actress Sneha Shares Beautifull Saree Photos In Her Instagram
Sneha : చీరల విషయంలో స్నేహ కండీషన్.. ఒక్కసారి కట్టిందంటే ఆ శారీని మళ్లీ ముట్టుకోదట.. ఎందుకో తెలుసా.. ?
తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ స్నేహ. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సంప్రదాయంగా కనిపిస్తూనే అందం, అభినయంతో కట్టిపడేసింది. సహజ నటనతో అడియన్స్ హృదయాలను దొచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది.
Updated on: Jun 16, 2025 | 9:45 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు హీరోయిన్. ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూనే తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తక్కువ సమయంలోనే అభిమానుల ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది స్నేహ. తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ్ హీరో ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది.

ఇక కొన్నేళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. యంగ్ హీరోలకు అక్కగా, వదినగా నటిస్తుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఇప్పుడు సినిమాలతోపాటు పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం చీరల వ్యాపారంలోనూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. స్నేహ కట్టిన చీరను మళ్లీ కట్టుకోదట. అందుకు పెద్ద కారణమే ఉందట. గతంలో ఓ మ్యాగజైన్ తన గురించి న్యూస్ రాస్తూ.. ఎప్పుడూ ధరించిన దుస్తులనే ధరిస్తుందని.. ఆమెకు వేరే బట్టలు లేవని రాసిందట. ఆ సమయంలో తన దుస్తులు, డ్రెస్సింగ్ మీద చాలా విమర్శలు వచ్చాయని చెప్పుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోదట.

ఇటీవలే స్నేహాలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ స్టార్ట్ చేసింది స్నేహ. అలాగే తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం చీరల ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.



















