- Telugu News Photo Gallery Cinema photos Actress Rukmini Vasanth Hikes Her Remenuration per Movie Rumours Goes Viral
Rukmini Vasanth: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. ఈ బ్యూటీ జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడలో ఆమె నటించిన సప్త సాగరాలు దాటి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు తమిళ భాషలోకి డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఇప్పుడు ఈబ్యూటీకి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.
Updated on: Jun 07, 2025 | 11:46 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మోగుతున్న పేరు రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కన్నడలో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాసాలు క్యూ కట్టాయి. ఒక్క సినిమాతోనే తెలుగువారి హృదయాలు గెలుచుకుంది.

ఇటీవలే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి వెళ్లిపోయింది. ఈ సినిమాతో రుక్మిణికి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్ పేరు)లో నటిస్తుందని టాక్.

అలాగే తెలుగులో మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడు సెలక్ట్ అయినట్లు సమాచారం. ఇక ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తుండడంతో రుక్మిణి ఇప్పుడు రెమ్యునరేషన్ సైతం పెంచినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. ఇప్పుడిదే ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రుక్మిణి వసంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినప్పటికీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. అంతేకాదు.. ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నింటిపై విపరీతమైన బజ్ నెలకొంది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమాల్లో ఒక్కటి హిట్టు అయినా క్రేజ్ మారిపోతుంది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సినిమాతో రుక్మిణికి పాన్ ఇండియా క్రేజ్ రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. దీంతో సౌత్ ఇండస్ట్రీతోపాటు నార్త్ లోనూ ఈ బ్యూటీ పేరు మారుమోగనుంది. రష్మిక తర్వాత ఆ స్థాయిలో ఈ బ్యూటీ అదరగొట్టేలా ఉందని అంటున్నారు.




