- Telugu News Photo Gallery Cinema photos Actress Richa Chadha Says She Drank The Alcohol For Dance Scene In Heeramandi Web Series
Richa Chadha: మద్యం తాగి షూటింగ్ చేసిన హీరోయిన్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే..
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ హీరామండి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ కు సినీ ప్రియుల ప్రశంసలు అందుతున్నాయి. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీతోపాటు.. బాలీవుడ్ తార రిచా చద్దా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిచా చద్దా తాజాగా హీరామండి షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతి సన్నివేశాన్ని శ్రద్దగా తెరకెక్కిస్తారని అన్నారు. ఇందులో ఓ సన్నివేశంలో తాను మద్యం తాగి డాన్స్ చేయాలట.
Updated on: May 11, 2024 | 9:08 PM

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ హీరామండి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ కు సినీ ప్రియుల ప్రశంసలు అందుతున్నాయి. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీతోపాటు.. బాలీవుడ్ తార రిచా చద్దా నటించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిచా చద్దా తాజాగా హీరామండి షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతి సన్నివేశాన్ని శ్రద్దగా తెరకెక్కిస్తారని అన్నారు. ఇందులో ఓ సన్నివేశంలో తాను మద్యం తాగి డాన్స్ చేయాలట.

అయితే రోజంతా షూటింగ్ చేసినా కనీసం పావువంతు కూడా కాలేదని.. అందుకోసం ఏకంగా 40 టేక్స్ తీసుకున్నట్లు తెలిపింది. అయినా అనుకున్నట్లుగా రాకపోవడంతో మరుసటి రోజు నిజంగానే మద్యం తాగి డాన్స్ చేసినట్లు తెలిపింది.

ఆ తర్వాత డాన్స్ అనుకున్నట్లుగానే వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను పోషించే పాత్రకు 100 శాతం న్యాయం చేయాలనుకునే స్వభావం తనదని.. అప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటామని అన్నారు.

ఎలా ఉంటాం.. డ్రెస్సింగ్ ఎలా ఉంటుందనేది ఎవరూ గమనించరని.. కేవలం నటనను మాత్రమే చూస్తారని అన్నారు. హీరామండి సిరీస్ లో తనది చాలా మంచి పాత్ర అని.. అందుకే సెట్ లో అందరి సూచనలు తీసుకున్నట్లు తెలిపింది.





























