- Telugu News Photo Gallery Cinema photos Actor Naveen Chandra Enjoying In Beach With His Family, See Photos
Naveen Chandra: హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం
హీరో నవీన్ చంద్ర ఇటీవలే మాస్ జాతర సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో శివుడి పాత్రలో క్రూరమైన విలన్ గా అదరగొట్టాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ హీరో ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి సేద తీరుతున్నాడు
Updated on: Nov 10, 2025 | 8:16 PM

హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలడు నవీన్ చంద్ర. యాక్టింగ్ లో ఆల్ రౌండర్ అనిపించుకుంటోన్న ఈ నటుడు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.

నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర. ఇందులో రవితేజను ఢీకొట్టే బలమైన విలన్ శివుడి పాత్రలో విశ్వరూపం చూపించాడు నవీన్.

మాస్ జాతర సినిమాలో నవీన్ చంద్ర నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో

ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంటోన్న నవీన్ చంద్ర తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి బీచ్ కు వెళ్లాడు. అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపారు.

ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇందులో నవీన్ భార్య, కుమారుడు ఎంతో క్యూట్ గా ఉన్నారు.

కాగా నవీన్ చంద్ర భార్య పేరు ఓర్మా. ఈమె మలయాళి. ఈ దంపతులది ప్రేమ వివాహమని తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.




