- Telugu News Photo Gallery Chia Seeds Side Effects: Can Eating Too Many Chia Seeds Cause Side Effects? Know Here
Chia Seeds: ఆరోగ్యానికి మంచిది కదా అని తెగ లాగించేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
బరువు తగ్గడానికి చియా విత్తనాలు చేసే మేలు అంతాఇంతా కాదు. పోషకాహార నిపుణులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Jun 06, 2024 | 2:08 PM

బరువు తగ్గడానికి చియా విత్తనాలు చేసే మేలు అంతాఇంతా కాదు. పోషకాహార నిపుణులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా, కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అయితే చియా విత్తనాలు అందరికీ మంచిది కాదు.

చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. చియా గింజల్లో ఉండే అధిక ఫైబర్ పొట్ట సమస్యలను పెంచుతుంది. అజీర్ణం, గ్యాస్, అపానవాయువు తలెత్తవచ్చు. మీకు ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే, చియా విత్తనాలను తినకపోవడమే మంచిది. చియా సీడ్ కొన్నిసార్లు అతిసారం, వాంతులు, దురద వంటి ప్రతిచర్యలకు కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యలున్నవారు చియా విత్తనాలను తినకపోవడమే మంచిది.

చియా విత్తనాలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయట. కాబట్టి చియా సీడ్స్ ఎక్కువగా తినకండి. చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రక్తాన్ని పల్చగా మార్చడంలో సహాయపడతాయి. దీంతో శరీరంలో ఏ భాగంలోనైనా గాయం అయితే రక్తస్రావం ఆగదు. అందుకే చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా ఈ చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. ఇవి ఎప్పుడైనా బీపీ తగ్గించగలవు.

చియా విత్తనాలు బరువు తగ్గడానికి గ్రేట్‌గా పనిచేస్తాయి. కానీ చియా సీడ్స్ సరైనరీతిలో తినకపోతే బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడం మొదలవుతుంది. 2 టీస్పూన్ల చియా గింజల్లో దాదాపు 138 కేలరీలు ఉంటాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాలను రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర టీస్పూన్లు మాత్రమే తీసుకోవాలి. నీటిలో నానబెట్టి లేదా పాలు, పెరుగులో చియా గింజలను కలుపుకొని తాగవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని తీసుకుంటే ప్రమాదకరమనే విషయం గుర్తుంచుకోండి.





























