Chest Pain: తరచూ ఛాతినొప్పి వస్తుందా? ఇలా చేశారంటే ఇంట్లోనే ఉపశమనం పొందొచ్చు..
గుండెపోటు నొప్పి సాధారణంగా ఛాతీ ఎడమ వైపున వస్తుంది. అయితే కొంతమందికి ఏమి తిన్నా, ఏమి తాగినా ఛాతి నొప్పి వస్తుంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కానీ పునరావృతమయ్యే ఛాతీ నొప్పికి మాత్రలు వేసుకునే బదులు, ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి..
Updated on: Apr 04, 2025 | 8:10 PM

కొంతమందికి ఏమి తిన్నా, ఏమి తాగినా ఛాతీ నొప్పి వస్తుంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కానీ పునరావృతమయ్యే ఛాతీ నొప్పికి మాత్రలు వేసుకునే బదులు, ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఛాతీ నొప్పి నుంచి తేలిగ్గా ఉపశమనం పొందవచ్చు. ఎలాగంటే..

చల్లటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి వారం పాటు తాగితే ఛాతీ నొప్పి తగ్గుతుంది. నిమ్మరసం కొంతమందికి సరిపోకపోవచ్చు. కాబట్టి దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ధనియాలను పొడి చేసి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి పాలు, చక్కెరతో కలిపి తాగితే ఛాతీ నొప్పి తగ్గుతుంది.

చిన్న జామకాయను కోసి, నీటిలో బాగా మరిగించి కషాయం తయారు చేసి, మజ్జిగలో కలిపి తాగడం వల్ల కూడా ఛాతీ నొప్పి తగ్గుతుంది.

కొత్తిమీర ఆకులను కొబ్బరి నీళ్లలో కలిపి, రాతి చక్కెర, ఏలకుల పొడిని ఆ మిశ్రమంలో కలిపి, రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఛాతీ నొప్పి తగ్గుతుంది. అయినా ఛాయి నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.





























