- Telugu News Photo Gallery Business photos Suzuki issues recall for its 125cc scooters in India, check details in telugu
Suzuki Scooter: 3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందేమో చూసుకోండి..
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారైన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన 125సీసీ స్కూటర్లను భారీగా రీకాల్ చేసింది. వీటిల్లో సుజుకీ యాక్సెస్ 125, బుర్గ్ మన్ స్ట్రీట్ 125, అవెనిస్ 125 సీసీ స్కూటర్లు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు తమ వాహనాలను సమీపంలోని సర్వీస్ సెంటర్‌లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎన్ని వాహనాలను వెనక్కి తీసుకుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 28, 2024 | 3:15 PM

ఎన్ని స్కూటర్లు అంటే.. సుజుకీ భారీ ఎత్తున తన స్కూటర్లను రీకాల్ చేసింది. 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య తయారైన మొత్తం 3,88,411 వాహనాలను రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత షాకింగ్ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సమస్య ఏమిటంటే.. ఇంత షాకింగ్ నిర్ణయం వెనుక కారణంపై సుజుకీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఆయా స్కూటర్లలో ఇంజిన్ ఆగిపోవడం, స్టార్టింగ్ ఫెయిల్యూర్, స్పీడ్ డిస్‌ప్లే సరిగా చూపకపోవడం, ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలకు గల కారణాలను అధికారిక రీకాల్ నోటీసులో కంపెనీ పేర్కొంది.

కారణమిదే.. డ్రాయింగ్ రిక్వైర్ మెంట్స్ (ఎన్జీ)కు సరిపోని హై టెన్షన్ కార్డ్‌ను ఇగ్నిషిన్ కాయిల్‌కు ఇన్‌స్టాల్ చేయడం వల్ల రన్నింగ్‌లో ఇంజిన్ కదలిక కారణంగా హై టెన్షన్ కార్డ్‌లో పగుళ్లు వచ్చి విరిగిపోయింది. దీంతో ఇంజిన్ స్టార్ట్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంకా హై టెన్షన్ కార్డ్ నీటికి ఎక్స్ పోజ్ అయినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్‌లు దెబ్బతింటున్నాయి. ఫలితంగా స్పీడ్ డిస్‌ప్లే కనపడటం లేదు.

ఈ బైక్ కూడా రీకాల్.. సుజుకీ బ్రాండ్ నుంచి ఇటీవల లాంచ్ అయిన తన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్టోర్మ్ 800డీఈ(V-Strom 800 DE) కూడా రీకాల్ చేసింది. దీనిలో ఏర్పడిన వెనుక టైర్ లోపం కారణంగా ఇప్పటి వరకు విక్రయించిన మోటార్‌సైకిల్‌లో ప్రత్యేకంగా 67 యూనిట్లను కంపెనీ రీకాల్ చేసింది.

కొత్త లాంచ్ లు.. సుజుకి ఇటీవలే యాక్సెస్ 125, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125, అవెనిస్ 125 స్కూటర్లలో 2024 మోడల్‌లను విడుదల చేసింది. అయితే ఈ స్కూటర్‌లలో కొత్త అప్ డేట్ ఏమి లేదు. కొత్త కలర్ ఆప్షన్లలో మాత్రమే కంపెనీ వీటిని పరిచయం చేసింది. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలలో ఈ కొత్త స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.




