Investment Ideas: ఈ మూడింటిలో పెట్టుబడితే పెడితే మీరే కింగ్.. వద్దన్నా కోటీశ్వరులు అవ్వుతారు
ఇన్వెస్టమెంట్లపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రముఖ ఇన్వెస్టర్ కియోసాకి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బై.. బై యూఎస్ డాలర్ అంటూ వ్యాఖ్యానించిన ఆయన. . వాటిని పొదుపు చేసుకుంటే నష్టపోతారని అన్నారు. వేటిల్లో పెట్టుబడి పెడితే మంచిదనేది కూడా ఆయన చెప్పారు.
Updated on: Dec 07, 2025 | 4:44 PM

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి పెట్టుబడులపై అవగాహన కల్పిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితి దిగజారడం, పలు దేశాలు అర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడం, బంగారం రేట్లు ఆమాంతంగా పెరిగిపోతున్న క్రమంలో ఇన్వెస్టర్లకు పలు సూచనలు చేస్తున్నారు. ఎందులో పెట్టుబడులు పెడితే మంచిదనే దానిపై సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు. దీంతో కియోసాకి సూచనలు చాలామంది ఫాలో అవుతుండటంతో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. ఆయన ఎక్స్ అకౌంట్‌ను కోట్ల మంది ఫాలో అవుతూ ఇన్వెస్ట్‌మెంట్ చిట్కాలు తెలుసుకుంటున్నారు

తాజాగా కియోసాకి ఎక్స్‌లో మరో ఇన్వెస్ట్‌మెంట్ ట్రిక్ చెప్పారు. ట్రంప్ నిర్ణయాలతో యూఎస్ డాలర్ పడిపోతున్న క్రమంలో పెట్టుబడిదారులకు కీలక సూచన చేశారు, యూఎస్ డాలర్లు పొదుపు చేసుకుంటే నష్టపోతారన్న ఆయన.. బై..బై యూఎస్ డాలర్ అంటూ వ్యాఖ్యానించారు. యూఎస్ డాలర్లను కలిగి ఉంటే మీరు తుడుచుకుపెట్టుకుపోతారంటూ తెలిపారు.

ఈ గడ్డు పరిస్థితుల్లో డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే దానిపై కియోసాకి పలు సూచనలు చేశారు. బంగారం, వెండి, బిట్ కాయిన్లలో పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. వీటిల్లో పెట్టుబడి పెడితే మీరు నష్టపోయే అవకాశం ఉండదని, యూఎస్ డాలర్లలో పొదుపు చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

బంగారం, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే డాలర్ పతనమైనా మీకు ఇబ్బంది ఉండదని కియోసాకి చెప్పుకొచ్చారు. తన బెస్ట్ పెట్టుబడి మార్గాలు అవేనన్నారు. తాను ఇంకా వాటిల్లోనే పెట్టుబడులు పెడుతున్నాన్నట్లు చెప్పారు. బ్రిక్ దేశలు కొత్త కరెన్సీని ప్రకటించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని కియోసాకి సూచించారు.

అయతే ఇటీవల అమెరికా డాలర్ గురించి కియోసాకి వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది. ఇక బై.. బై డాలర్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.




