సవరించిన ఐటీ రిటర్నుల దాఖలు.. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం

వివిధ ఆదాయ పన్ను కంప్లయెన్స్‌ సహా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు సహా సంబంధించిన గడువు తేదీని ఈనెల 31వ తేదీ వరకు పొ..

  • Subhash Goud
  • Publish Date - 2:37 pm, Sun, 2 May 21
1/3
It 1
వివిధ ఆదాయ పన్ను కంప్లయెన్స్‌ సహా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు సహా సంబంధించిన గడువు తేదీని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.
2/3
It 3
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్‌కు సంబంధించిన వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు రావడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139 సబ్‌ సెక్షన్‌ (5) కింద సవరించిన రిటర్నులు, సబ్‌ సెక్షన్‌ (4) కింద లేట్‌ రిటర్నులను ఈ ఏడాది మార్చి 31 లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు సీబీడీటీ వెల్లడించింది.
3/3
It 4
అలాగే డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ ప్యానల్‌ (డీఆర్‌పీ)కు సమర్పించాల్సిన అభ్యంతరాలు సహా కమిషనర్‌కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్‌ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.