- Telugu News Photo Gallery Business photos BSNL users can now get 2GB data and unlimited calling for just Rs 1
BSNL: ఇది కదా కావాల్సింది.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ.. డైలీ 2GB డేటా, అపరిమిత కాల్స్!
BSNL Offer: దీనితో పాటు కస్టమర్లు USSD కోడ్ ఉపయోగించి కూడా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నుండి BSNL సూచించిన షార్ట్ కోడ్‌ను డయల్ చేయండి. ఆఫర్ వెంటనే ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ 30..
Updated on: Sep 12, 2025 | 4:39 PM

BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చౌకైన ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇటీవల ఫ్రీడమ్ ఆఫర్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. అంటే సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ప్లాన్ కొత్త సిమ్ తీసుకునేవారికి మాత్రమే. కేవలం 1 రూపాయితోనే సిమ్ కొనుగోలు చేసి 30 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

కస్టమర్ల అద్భుతమైన స్పందన, ఉత్సాహం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు BSNL తెలిపింది. ఆగస్టులో సకాలంలో ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన వినియోగదారులకు కూడా ఈ అదనపు 15 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి.

ఆఫర్ ప్రయోజనాలు: ఈ ప్రత్యేక ఆఫర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు చాలా అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఉచిత SMSలను పొందుతారు. దీనితో పాటు కస్టమర్లకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్‌లు, రీఛార్జ్ బోనస్, MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్ నుండి సులభమైన యాక్టివేషన్ సౌకర్యం కూడా అందించనుంది.

ఎలా యాక్టివేట్ చేయాలి?: మీరు BSNL వినియోగదారు అయితే, ఈ ప్రత్యేక ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ ప్రక్రియ చాలా సులభం. ముందుగా MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి అక్కడ నుండి “ఫ్రీడమ్ ఆఫర్” ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత మీరు రూ.1 మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ పూర్తయిన వెంటనే, 2GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం మీ నంబర్‌లో వెంటనే యాక్టివేట్ అవుతుంది.

మరో పద్దతి: దీనితో పాటు కస్టమర్లు USSD కోడ్ ఉపయోగించి కూడా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నుండి BSNL సూచించిన షార్ట్ కోడ్‌ను డయల్ చేయండి. ఆఫర్ వెంటనే ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ 30 రోజులు వ్యాలిడిటీ: ఇది మొదటి 30 రోజులు పూర్తిగా ఉచితం. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి మీరు రూ. 1 టోకెన్ ఫీజు చెల్లించాలి. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత మీకు నచ్చిన ఏదైనా సాధారణ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నంబర్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు.




