Subhash Goud |
Updated on: Apr 11, 2022 | 10:19 AM
BMW India: టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కార్ల తయారీ కంపెనీలు.
జర్మనీ వాహన తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) కూడా మార్కెట్లో కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. 2022 మంచి సంవత్సరం కానుందని బీఎండబ్ల్యూ అంచనా వేస్తోంది.
సెమీకండక్టర్ల కొరతతో పాటు పలు సవాళ్లు ఎదురైనప్పటికీ.. జనవరి - మార్చి నెలలో కార్ల అమ్మకాలు 25 శాతం పెరిగి 2,815కు, ద్విచక్ర వాహనాల విక్రయాలు 41 శాతం పెరిగి 1,518కి చేరినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా తెలిపారు.
ఈ ఏడాది కార్ల విభాగంలో 19, ద్విచక్ర వాహన విభాగమైన బీఎండబ్ల్యూ మోటోరాడ్‌లో 5 వాహనాలతో కలిపి మొత్తం 24 మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మేలో కొత్త విద్యుత్ సెడాన్ ఐ4ను కంపెనీ విడుదల చేయనుంది.