Bloated Stomach Remedies: మీకూ భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా? ఆహారం విషయంలో ఈ తప్పులు చేయకండి
భోజనం తర్వాత కొన్నిసార్లు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. ఇలా తరచుగా కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు తలెత్తితే అనారోగ్యకరమైన ఆహారం కారణం కావచ్చు. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యత కూడా కడుపు నొప్పి, ఉబ్బరం కలిగిస్తుంది. ముఖ్యంగా ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో హార్మోన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. అదనంగా ఎక్కువ సోడియం వివిధ ఆహారాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే..
Updated on: Feb 20, 2024 | 1:22 PM

భోజనం తర్వాత కొన్నిసార్లు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. ఇలా తరచుగా కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు తలెత్తితే అనారోగ్యకరమైన ఆహారం కారణం కావచ్చు. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యత కూడా కడుపు నొప్పి, ఉబ్బరం కలిగిస్తుంది.

ముఖ్యంగా ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో హార్మోన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. అదనంగా ఎక్కువ సోడియం వివిధ ఆహారాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే, శరీరంలోని ద్రవం స్థాయి మారుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బుతుంది. జీర్ణ సమస్యల నుంచి కడుపు ఉబ్బరం వరకు గల కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. అధిక ఒత్తిడి హార్మోన్ల విడుదలకు కారణమవుతుంది. ఇది గట్, మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బవచ్చు.

ప్రారంభం దశలో కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమ్యల నుంచి బయటపడొచ్చు. ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. జంక్ ఫుడ్‌కు బదులుగా, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తగినంతగా తినాలి. అప్పుడు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపులో అసౌకర్యం తగ్గుతుంది.

భోజనం చేసేటప్పుడు తొందగా తనికూడదు. బాగా నమిలి, నెమ్మదిగా తినాలి. అప్పుడు జీర్ణశక్తి మెరుగుపడి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు తగ్గితే కడుపు భారం, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతాయి. అలాగే నీరు పుష్కలంగా తాగాలి. ఆహారాన్ని జీర్ణం చేయడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తక్కువ చక్కెర పానీయాలు తాగాలి. చక్కెర పానీయాలు, కృత్రిమ చక్కెర ఆహారాలు ఉబ్బరానికి కారణం. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

ఒత్తిడిని తగ్గించడం ద్వారా జీర్ణక్రియ నుండి ఉబ్బరం వరకు అన్ని సమస్యలను నివారించవచ్చు. ధ్యానం, యోగా, లోతైన శ్వాస, తగినంత నిద్ర ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బరువు తగ్గడం, రక్తంతో కూడిన మలం, బలహీనత, పొత్తికడుపు నొప్పితోపాటు పొత్తికడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.




