- Telugu News Photo Gallery Black watermelon world most expensive and rare watermelon all you need to know details
Black Watermelon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఒక్క ముక్క ధరనే ‘లక్ష’ల్లో.. పూర్తి రేట్ తెలిస్తే గుండె గుభేలే..!
వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడి, పుచ్చకాయ. ప్రపంచంలోని ఖరీదైన, వెరైటీగా పిలువబడే అనేక రకాల పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బ్లాక్ పుచ్చకాయ, డెన్సుకే పుచ్చకాయలు అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ జపాన్‌లో దొరుకుతుంది. మరి ఆ పుచ్చకాయలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 02, 2022 | 6:20 AM

వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడి, పుచ్చకాయ. ప్రపంచంలోని ఖరీదైన, వెరైటీగా పిలువబడే అనేక రకాల పుచ్చకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బ్లాక్ పుచ్చకాయ, డెన్సుకే పుచ్చకాయలు అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ జపాన్‌లో దొరుకుతుంది. మరి ఆ పుచ్చకాయలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

దాని బయటి భాగం నలుపు రంగులో ఉండటంతో దీనిని బ్లాక్ పుచ్చకాయ అని పిలుస్తున్నారు. ఇది ఇతర పుచ్చకాయల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇది సాధారణ పుచ్చకాయ మాదిరిగా మార్కెట్లో విక్రయించలేరు. ఈ ప్రత్యేకమైన జపనీస్ పుచ్చకాయ కోసం వేళం వేస్తారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 2019 ఒక బ్లాక్ పుచ్చకాయ ముక్క రూ. 4.5 లక్షలకు విక్రయించడం జరిగింది.

ఇది జపాన్‌లోని హక్కైడో ద్వీపం ఉత్తర ప్రాంతంలో కనుగొనబడింది. దీని దిగుబడి చాలా తక్కువ. అందుకే దీన్ని అరుదైన పుచ్చకాయగా పరిగణించారు. ఏడాదిలో దాదాపు 100 నల్ల పుచ్చకాయలు ఉత్పత్తి అవుతాయి. అయితే, అనేక విధాలుగా ఇది ఇతర పుచ్చకాయలకు భిన్నంగా ఉంటుంది. రుచి, రూపం, విత్తనాలు అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

బ్లాక్ వాటర్ మెలాన్ ఇతర పుచ్చకాయల కంటే తియ్యగా ఉంటుంది. అందుకే దీన్ని తియ్యటి పుచ్చకాయగా కూడా పేర్కొంటారు. అందులో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ సంఖ్యలో విత్తనాలు ఉండటం వలన తినడం కూడా సులభం అవుతుంది. వివిధ రకాల పరీక్షల కారణంగా ఇది జపాన్‌లో చాలా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఇతర పుచ్చకాయల బయటి భాగంలో చారలు ఉంటాయి. కానీ ఇది నల్లగా ఉంటుంది.