- Telugu News Photo Gallery Biryani leaves can check with any urinary problems, check here is details in Telugu
Bay Leaves Benefits: ఎలాంటి మూత్ర సమస్యలకైనా బిర్యానీ ఆకుతో చెక్ పెట్టొచ్చు!
భారతీయ మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. బిర్యానీ ఆకు లేనిదే ఎలాంటి మసాలాల వంట కూడా పూర్తి కాదు. బిర్యానీ ఆకు కేవలం ఆకు అనుకుంటే మాత్రం పొరపాటే. బిర్యానీ ఆకుతో ఆరోగ్య పరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. భారతీయ మసాలాలను సరిగ్గా వాడితే చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అందుకే పూర్వం నుంచి పెద్దలు పలు రకాల మసాలా దినుసులను వంటకాల్లో ఉపయోగించే వారు. వీటిల్లో బిర్యానీ ఆకు..
Updated on: Jan 28, 2024 | 11:48 AM

భారతీయ మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. బిర్యానీ ఆకు లేనిదే ఎలాంటి మసాలాల వంట కూడా పూర్తి కాదు. బిర్యానీ ఆకు కేవలం ఆకు అనుకుంటే మాత్రం పొరపాటే. బిర్యానీ ఆకుతో ఆరోగ్య పరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. భారతీయ మసాలాలను సరిగ్గా వాడితే చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

అందుకే పూర్వం నుంచి పెద్దలు పలు రకాల మసాలా దినుసులను వంటకాల్లో ఉపయోగించే వారు. వీటిల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి.

బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, మూత్ర విసర్జన సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం అనేక మంతి మూత్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు నీటిలో బిర్యానీ ఆకు వేసి మరిగించిన నీటిని లేదా ఈ ఆకుల టీ తాగినా చాలా మంచిది. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

బిర్యానీ ఆకులో యాంటీ డయాబెటిక్, యాంటీ డయేరియా, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అంతే కాకుండా బిర్యానీ ఆకుతో కఫం, జలుబు, గొంతు నొప్పి, వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటిస్, నరాల నొప్పి ఉన్న వారికి కూడా ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. బిర్యానీ ఆకుల తలపై పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది.




