World Biryani Day 2023: దావత్ అంటే బిర్యానీ.. దేశంలో 12 మాసాల్లో 7.6 కోట్ల ఆర్డర్స్.. బిర్యానీ డే వేళ ఆసక్తికర వివరాలు

Biryani Day 2023: దావత్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. బిర్యానీయే భారతీయుల ఫేవరేట్ డిష్‌గా మరోసారి నిర్ధారణ అయ్యింది. జులై 2న వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ 2023 సంవత్సరపు తొలి సగం(ఆరు) మాసాలకు సంబంధించి ఈ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.

Janardhan Veluru

|

Updated on: Jul 01, 2023 | 5:46 PM

దావత్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. బిర్యానీయే భారతీయుల ఫేవరేట్ డిష్‌గా మరోసారి నిర్ధారణ అయ్యింది. జులై 2న వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ 2023 సంవత్సరపు తొలి సగం(ఆరు) మాసాలకు సంబంధించి ఈ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.

1 / 6
గత 12 మాసాల్లో దేశంలో ఏకంగా 7.6 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. ప్రతి నిమిషానికి 219 బిర్యానీ ఆర్డర్లు అందినట్లు తెలిపింది. వీటిలో ఎక్కువగా లక్నో బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, కొల్‌కత్తా బిర్యానీ, మలబార్ బిర్యానీ కోసం ఆర్డర్లు అందినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 15 వరకు బిర్యానీ ఆర్డర్లు.. 2022లో ఇదే కాలంతో పోల్చితే 8.29 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. దేశంలో 2.6 లక్షల రెస్టారెంట్లు స్విగ్గీ ద్వారా బిర్యానీ డెలివరీ చేస్తున్నాయి.

2 / 6
అటు హైదరాబాదీలు కూడా బిర్యానీ పట్ల తమకు మోజు ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు. గత ఆరు మాసాల్లో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు అందినట్లు స్విగ్గీ వెల్లడించింది. అంటే రోజుకు దాదాపు 40 వేల బిర్యానీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గత 12 మాసాల కాలంలో హైదరాబాద్‌లో ఏకంగా 1.5 కోట్ల బిర్యానీ ఆర్డర్లు అందినట్లు స్విగ్గీ తెలిపింది.

3 / 6
మరీ ముఖ్యంగా దమ్ బిర్యానీ కోసం అత్యధికులు ఆర్డర్ చేసుకున్నారు. ఐదున్నర మాసాల కాలంలో 9 లక్షల దమ్ బిర్యానీ ఆర్డర్లు రాగా.. బిర్యానీ రైస్ ఆర్డర్లు 7.9 లక్షలు, మినీ బిర్యానీ ఆర్డర్లు 5.2 లక్షలు వచ్చినట్లు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.

4 / 6
హైదరాబాద్‌లో దాదాపు 15,000 రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్లను తీసుకుంటున్నాయి. అత్యధికంగా కూకట్‌పల్లిలోని రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్స్‌ను స్విగ్గీ ద్వారా డెలివరీ చేస్తున్నాయి. మాదాపూర్, అమీర్‌పేట్, బంజారా హిల్స్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు కూకట్‌పల్లి తర్వాత అత్యధికంగా స్విగ్గీ ద్వారా బిర్యానీ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్న ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.

5 / 6
దేశంలో స్విగ్గీలో జరిగే బిర్యానీ ఆర్డర్లలో ప్రతి ఐదింటిలో ఒకటి హైదరాబాద్ నుంచే కావడం విశేషం. మెనూలో ఎన్ని ఉన్నా.. బిర్యానీ ఆర్డర్ చేయనిదే హైదరాబాదీలు భోజనం ముగించడం లేదని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎప్పటికీ బిర్యానీనే తమ ఫేవరేట్‌గా చాటిచెబుతున్నారు. హైదరాబాదీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా.. తప్పక బిర్యానీ ఆర్డర్ చేసుకుని దాని రుచిని ఎంజాయ్ చేస్తున్నారు.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!