Best Seasonal Fruits: ఈ ఐదు పండ్లతో రోగ నిరోధక శక్తికి బూస్ట్.. శరీరానికి మరింత మేలు
వసంతకాలం అంటేనే వివిధ రకాల పండ్లకు సీజన్. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే అన్ని పండ్లు మరేకాలంలోనూ రావు. తాజా పండ్లను, కూరగాయాలను విరివిగా తింటే చాలా మేలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా పోషకాహార నిపుణులు శరీర బరువు నిర్వహణకు, అలాగే బరువు తగ్గాలనుకునేవారు సీజనల్‌గా దొరికే పండ్లను తినమని సూచిస్తుంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి మెరుగవ్వడానికి సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఈ సీజన్‌లో దొరికే ఐదు పండ్లను తింటే శరీరానికి చాలా మేలు చేసినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారు సూచించే ఐదు పండ్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.