AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు అతి చేరువలో అందమైన హిల్స్‌…

స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేశారు.. ఇంటర్‌ విద్యార్థులకు రిజల్ట్స్‌ కూడా వచ్చేశాయి.. ఇంతలో వీకెండ్‌ కూడా వచ్చేస్తోంది.. అయితే, సండే వచ్చిందంటే చాలా మంది ఫ్రెండ్స్ అండ్​ ఫ్యామిలీతో కలిసి టూర్స్​ ప్లాన్​ చేస్తుంటారు. రోజు వర్క్‌ టెన్షన్‌, పిల్లల పరీక్షలతో ఇన్ని రోజులు గజిబిజిగా ఉన్నవారు.. ఒక్క రోజు అలా సరదా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుంటారు... లాంగ్‌ టూర్‌ కాకుండా.. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న అందమైన ప్రదేశాల కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌ అవుతుంది.. తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్​ను చూసేందుకు ఒక్కరోజు సరిగ్గా సరిపోతుంది...

Jyothi Gadda
|

Updated on: Apr 22, 2025 | 1:20 PM

Share
వికారాబాద్​ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్  హైదరాబాద్‌కు అతి చేరువలో ఉంటుంది. ఇక్కడి పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. నిన్న మొన్నటి ఒత్తిడినంత పక్కకు నెడుతూ ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతారు.. అంత బాగుంటుంది ఈ ప్రాంతం.

1 / 5
అయితే, ఈ అనంతగిరి కొండలకు ఆ శ్రీ మహా విష్ణువుకు దగ్గరి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నారు. తిరుమల కొండలతో పోల్చితే అనంతగిరి కొండలు చాలా చిన్నవి. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమనీ, కర్నూలు జిల్లాలోగల అహోబిలం కొండలు మధ్యభాగమని, అనంతగిరి కొండ తోక భాగమని చెబుతుంటారు. ఇకపోతే, కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల 'అనంత పద్మ నాభస్వామి ఆలయం' అందరినీ ఆకర్షిస్తోంది.

2 / 5
ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంటుంది.. అక్కడికి వెళ్లడానికి సుమారు వందమెట్లు దిగి వెళ్లాలి. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా మొదలై హైదరాబాద్‌ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

3 / 5
సెలవులు, వీకెండ్‌ రోజుల్లో అనంతరగిరికి వచ్చే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుండి 80 కి.మీ దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ స్వర్గం కంటే అందంగా ఉంటుంది. కులు-మనాలీ అందం కూడా అనంత గిరుల ముందు మసకబారుతుందని చెప్పాలి.

4 / 5
మూసి నది అనంతగిరి కొండల నుండి ఉద్భవించింది. దాని అందం అద్భుతంగా ఉంది. దీన్ని చూడటానికి చాలా దూరం నుండి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ట్రెక్కింగ్‌ ఇష్టపడే వాళ్లు ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కొండ ప్రాంతం సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

5 / 5
Follow Us
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..

AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్

ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే

నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!