AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామూలు బిర్యానీ కంటే బెస్ట్ వెజ్ బిర్యానీ.. హరియాలీ వెజ్ దమ్ బిర్యానీ

బిర్యానీ అనగానే ఎక్కువమంది నాన్‌వెజ్ వైపే మొగ్గు చూపుతుంటారు; కానీ సరైన మసాలా దినుసులు, తాజా ఆకుకూరలతో 'హరియాలీ వెజ్ దమ్ బిర్యానీ' వండితే నాన్‌వెజ్ బిర్యానీని మించిన అద్భుతమైన రుచి, సువాసన లభిస్తాయి. సాధారణ వెజ్ బిర్యానీల కంటే ఇది ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా, ఆరోమాటిక్‌గా ఉంటుంది. ఈ బిర్యానీకి ప్రధానమైన ఆకర్షణ 'హరియాలీ పేస్ట్'. తాజా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మరసం మరియు పెరుగును కలిపి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేస్తారు. 

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 8:52 PM

Share
కావలసిన పదార్థాలు: 2 కప్పుల బాస్మతి బియ్యం, 1 మీడియం సైజు బంగాళాదుంప, 15 నుండి 20 కాలీఫ్లవర్ ముక్కలు, 6 నుండి 8 ఫ్రెంచ్ బీన్స్, 1 క్యారెట్, అర కప్పు ఫ్రోజెన్ బఠాణీ, 1 ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, బిర్యానీ మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్,  1½ టీస్పూన్ల కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టీస్పూన్ యాలకుల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కుంకుమపువ్వు రంగు, మైదా పిండి ముద్ద సీలింగ్ కోసం. హరియాలీ పేస్ట్ కోసం: 50 గ్రాముల తాజా కొత్తిమీర తరుగు, 50 గ్రాముల తాజా పుదీనా ఆకులు, 6 నుండి 8 పచ్చిమిరపకాయలు, 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బలు, అర అంగుళం ముక్క, 1 నిమ్మకాయ రసం నిమ్మరసం, కప్పు చిక్కటి కమ్మని మీగడ పెరుగు

1 / 6
తయారీ విధానం: మిక్సీ జార్‌లో 50 గ్రాముల కొత్తిమీర, 50 గ్రాముల పుదీనా, 6-8 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, 1 నిమ్మరసం, అర కప్పు పెరుగు వేసి కొద్దిగా నీటితో మెత్తని నునుపైన గ్రీన్ పేస్ట్‌లా రుబ్బుకోవాలి. బిర్యానీ హండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు ఆలు, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌పై ఆలు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి.

2 / 6
కూరగాయలకు సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, మిరియాల పొడి, 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి నూనె తేలే వరకు వేయించి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన హరియాలీ పేస్ట్, అర కప్పు బఠాణీ, అర కప్పు మీగడ పెరుగు, అర టీస్పూన్ గరం మసాలా, అర చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి హండీ అడుగున సమానంగా పరచాలి.

3 / 6
వేరొక పాత్రలో రెండున్నర లీటర్ల నీటిని హై ఫ్లేమ్‌పై మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు వేసి మరిగించాలి. ఇప్పుడు 1 గంట నానబెట్టిన 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 80% వరకు మెతుకు నలిపితే పలుకు ఉండేలా ఉడికించాలి.

4 / 6
80% ఉడికిన వేడి రైస్‌ను జాలి గరిటెతో వడకట్టి.. నేరుగా హండీలోని మ్యారినేట్ చేసిన వెజ్జీస్ పైన సమానంగా లేయర్ చేయాలి. రైస్ పైన 1 టీస్పూన్ కేసర్ కలర్, అర టీస్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి చల్లాలి. ఇప్పుడు బియ్యం ఉడికించిన గంజి నీళ్లలోంచి అర కప్పు నీటిని అంచుల వెంట, మధ్యలో పోయాలి. ఇది బిర్యానీ డ్రై అవ్వకుండా చేస్తుంది. హండీ అంచుల చుట్టూ మైదా పిండి ముద్దను అతికించి, చిన్న అర అంగుళం గ్యాప్ ఇచ్చి మూత పెట్టి గట్టిగా సీల్ చేయాలి.

5 / 6
మొదట హై ఫ్లేమ్‌పై 7 నిమిషాలు ఆ గ్యాప్ నుండి ఆవిరి తన్నుకొచ్చే వరకు ఉంచాలి. ఆవిరి రాగానే మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి 8 నిమిషాలు దమ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు మూత తీయకుండా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత సీల్ తీసి గరిటెతో అడుగు నుండి నెమ్మదిగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ 'హరియాలీ వెజ్ దమ్ బిర్యానీ' సిద్ధం! చల్లటి వెజ్ రైతాతో వేడివేడిగా తింటుంటే పుదీనా, కొత్తిమీర సుగంధ పరిమళాలతో మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన రుచినిస్తుంది!

6 / 6
Follow Us