AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Trees: చెట్లు ప్రకృతిలో అందాలకోసం మాత్రమే కాదు.. అనేక ప్రయోజనాలు ఇస్తాయని.. అవి ఏమిటో ఒక్కసారి చెక్ చేయండి.. మీరే చెట్ల పెంపకం మొదలు పెడతారు..

చెట్లు ప్రగతికి మెట్లు.. చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇది ప్రభుత్వం మాత్రమే కాదు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణ ప్రియులు చెప్పే విషయం. అయితే చెట్లు ప్రకృతి అందాలను పెంచడమే కాదు.. నేల పటుత్వాన్ని పెంచుతాయి. భూసారాన్ని చక్కగా కాపాడతాయి. వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చెట్ల నుంచి కలప, పండ్లు, పువ్వులు లభించడమే కాదు.. మానవాళి జీవనానికి అవసరం అయిన ఆక్సిజన్ ను కూడా ఇస్తాయి.  

TV9 Telugu
| Edited By: Surya Kala|

Updated on: Aug 29, 2023 | 1:16 PM

Share
ఉష్ణోగ్రత నియంత్రణ, సౌండ్ పొల్యూషన్ తగ్గింపు: ఒక పెద్ద చెట్టు 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం, అవి అందించే నీడ వీధి ఉష్ణోగ్రతను 30% కంటే ఎక్కువ తగ్గించగలదు. అంతే కాదు చెట్లు 50% వరకు శబ్దాన్ని తగ్గించగలవు. కార్లు, నిర్మాణం, సైరన్‌లు, విమానాలు మరియు ఇతర శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో, చెట్లు శబ్దాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. నగరాలను - వాటిలోని ఇళ్లు, కార్యాలయాల ను - నిశ్శబ్దంగా ఉంచడానికి సహాయం చేస్తాయి.

1 / 8
గాలి స్వచ్ఛత: చెట్లు గాలి నుండి హానికరమైన కాలుష్య కారకాలు, టాక్సిన్‌లను ఆశ్చర్యపరిచే మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత తరచుగా చెడుగా ఉంటుంది. మన ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలతో కూడి ఉంటుంది. చెట్లు మనం పీల్చే గాలిని మరింత పరిశుభ్రంగా మారుస్తాయి.

2 / 8
ఆక్సిజన్: ఆ కాలుష్యాలన్నింటినీ శోషించేటప్పుడు, చెట్లు మరింత ఆక్సిజన్‌ను తిరిగి పట్టణ వాతావరణంలోకి పంపుతాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి. చెట్లు ఆక్సిజన్ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి.

3 / 8
నీటి నిర్వహణ: చెట్లు వర్షం నీటిని నిల్వ చేస్తాయి. భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. నీటి పారుదలను తగ్గించి వరదల తీవ్రతను తగ్గిస్తాయి. వరదలు పూర్తిగా వచ్చే అవకాశం లేకుండా చేస్తాయి. వీటి మూలాలు కాలుష్య కారకాలను గ్రహిస్తాయి. నగర నీటి సరఫరా సమయంలో కాలుష్యం చేరకుండా చెట్లు నిరోధిస్తాయి.   

4 / 8
మానసిక శారీరక ఆరోగ్యానికి: పరి శుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతితో నిండిన పరిశరాల్లోనే  మానవులు ఎక్కువ సంతోషంగా ఉంటారు. చెట్లు మనస్తత్వశాస్త్రంపై తీవ్ర సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. చెట్లు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. చెట్లు పుష్కలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్ మరియు నడక సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే.. 

5 / 8
చెట్ల పరిరక్షణ కోసం పెట్టె ఖర్చుని ఆర్ధికంగా లెక్కించదరాదని ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఎదుకంటే ఇవి ఇచ్చే ప్రయోజనాల ముందు పెట్టె ఖర్చు చాలా తక్కువే అని అంటారు. ఇక చెట్ల వన్యప్రాణులకు ఆవాసాలుగా మారతాయి. పక్షులు, క్షీరదాలు , కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు మారతాయి. 

6 / 8
కాంతి కాలుష్య నివారణకు: చెట్లు కాంతిని అడ్డుకోవడమే కాదు.. మనల్ని..  మన నగరాలను చల్లగా ఉంచుతాయి.  వీధి దీపాలు, కార్లు, ఇంటి నుంచి వెలువడే కాంతిని నిరోధిస్తూ ఉంటాయి. అంతేకాదు ఎండల నుంచి రక్షణ ఇస్తాయి.   

7 / 8
చెట్లు ప్రకృతికి సరికొత్త అందాలను తీసుకొస్తాయి. పువ్వుల చెట్లు ఇంద్రధనస్సుని కనుల ముందుకు తీసుకొస్తే.. పండ్లు, కూరగాయలు వంటివి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక నగరాలు పట్టణాలు, పల్లెలు అనే బేధం లేకుండా చెట్లు పెంచడం వలన మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. 

8 / 8