మెంతి నీళ్లలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే..
06 February 2026
TV9 Telugu
TV9 Telugu
వంటగదిలో ఉండే రకరకాల దినుసుల్లో మెంతులు ముఖ్యమైనవి. ఇవి వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. మెంతులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
వీటిలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి
TV9 Telugu
మెంతుల్లో కరిగే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్‌ను శరీరం నెమ్మదిగా శోషిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి
TV9 Telugu
అంతేకాకుండా మెంతుల్లో 4 హైడ్రాక్సీఐసోలూసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
మెంతులను నానబెట్టి లేదా భోజనంలో కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెంతులను నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది
TV9 Telugu
దాల్చిన చెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరాయిడ్స్ కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
మెంతి గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తీసుకునే ముందు అందులో దాల్చిన చెక్క పొడి వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
అదే విధంగా తాజా ఉసిరి రసంలో మెంతి గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల పాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరచడంలో, గ్లూకోజ్ జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి